Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబాకు భక్తులు ఎక్కువే. గురువారం ఒక్క పొద్దు ఉండే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయి సంస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న కొన్ని నిబంధనలను తొలగించి భక్తుల సౌకర్యార్థం వెసులుబాటులు కల్పించింది. దీంతో భక్తుల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త చెప్పింది. గతంలో కాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అందరిలో ఆసక్తి కల్పిస్తోంది. సాయిబాబా సమాధి ముందు ఉన్న గాజును తొలగించాలని సంకల్పించింది.

షిర్డీ గ్రామస్తులు, సాయిబాబా సంస్థాన్ నిర్వాహకుల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాబా సమాధిని ఇకపై సామాన్యులు తాకేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇంతకుముందు బాబా సమాధిని వీఐపీలు మాత్రమే ముట్టుకునే వారు. ఇప్పుడు ఆ అవకాశం అందరు భక్తులకు అందుబాటులోకి రావడం ఆహ్వానించదగినదే. బాబా సమాధి ముందున్న అద్దాలు, మెష్ తొలగిండంతో పాటు ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో భక్తులకు సంతోషం కలుగుతోంది.
ద్వారకామయి ఆలయంలోకి కూడా భక్తులను అనుమతించేందుకు నిర్ణయించారు. సాయి హారతి జరుగుతున్నప్పుడు భక్తులు గురుస్థాన్ ఆలయంలో ప్రదక్షిణలు కూడా చేయవచ్చు. షిర్డీలో రద్దీ ఉన్న సమయంలో సమాధికి అడ్డంగా అద్దాన్ని పెట్టేవారు. అప్పుడు కేవలం వీఐపీలకే సమాధిని తాకే అవకాశం కల్పించేవారు. సాధారణ భక్తులకు ఆ చాన్స్ ఉండేదికాదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం సామాన్య భక్తులకు కూడా రావడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షిర్డీ వెళ్లే వారికి ఇది నిజంగా శుభవార్తే.

సమాధిని తాకే విషయంపై భక్తులతో పాటు గ్రామస్తులు మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడి దేవాదాయ శాఖ మంత్రి ఈ మేరకు నిర్ణయాలు చేసినట్లు చెబుతున్నారు. సాయి సంస్థాన్ తీుకున్న నిర్ణయంతో సమాధి చుట్టు ఉండే గాజు తెరతో పాటు మెష్ ను తొలగించనున్నారు. భక్తులు తమ చేతులతో సమాధిని తాకి మొక్కులు చెల్లించుకోవచ్చు. ఇంకా సాయి చరిత్రను వివిధ భాషల్లో ముద్రించి పంచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై అందరు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దీపావళి వేళ సాయి ఆలయానికి భారీగా విరాళాలు వచ్చాయి. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 5 వరకు భక్తుల నుంచి రూ.18 కోట్లు, హుండీ ద్వారా రూ. 3 కోట్లు, డొనేషన్ కౌంటర్లలో రూ.7 కోట్లు, ఆన్ లైన్ డొనేషన్ల ద్వారా రూ.1.50 కోట్లు, డీడీల ద్వారా రూ. 3 కోట్లు, ఎంవో ద్వారా రూ. 7 లక్షలు వచ్చాయి. ఇవే కాకుండా ఇంకా వెండి, బంగారం ఆభరణాలు రావడంతో సాయి సంస్థాన్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుని ఆలయ ప్రతిష్ట పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.