Jobs:దేశంలో కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులలో చాలామంది అర్హతకు తగిన ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్నారు. అయితే దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఆర్మీ పాఠశాలలలో 8700 ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ, పీఆర్‌టీ, టీజీటీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. వేర్వేరు సైనిక పాఠశాలలలో జాబ్స్ ను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
2022 సంవత్సరం జనవరి నెల 7వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ అడ్మిట్ కార్డ్ జారీ జరగనుండగా వచ్చే నెల ఫిబ్రవరి 20వ తేదీన ఆన్ లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 28వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హత పరీక్ష జరుగుతుంది.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బీఈడీ పూర్తి చేసిన వాళ్లు పీజీటీ జాబ్ కు అర్హులు. టీజీటీ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైతం ఇదే అర్హతను కలిగి ఉండాలి. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఫ్రెషర్స్, 57 సంవత్సరాల లోపు టీచింగ్ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో మొత్తం 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి.
ఈ పాఠశాలలలో ఏకంగా 8700 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటంతో అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో భోదనా సామర్థ్యం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల అర్హత ఉన్న నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.