Chat GPT Android Mobile: ఇప్పుడంతా ఎక్కడా చూసినా చాట్ జీపీటీ. మనుషులు చేయలేని ఎన్నో పనులను ఇది చేస్తుందని ఇప్పటికే కొన్ని మాధ్యమాల ద్వారా బయటకొచ్చింది. అయితే చాట్ జీపీటిని కేవలం ఐవోఎస్ యూజర్లకు మాత్రంమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అవకాశం తమకెప్పుడు వస్తుందా? అని ఎదురుచూశారు. తాజాగా ఓపెన్ ఏఐకి చెందిన పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు దీనిని డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది.
చాట్ జీపీటీ అనేది కృత్రిమ మేథతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్. ‘ఓపెన్ ఏఐ’ అనే సంస్థ దీనిని రూపొందించింది. ప్రముఖ వ్యాపార వేత్త, అపర కుభేరుడు ఎలాన్ మస్క్ ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్నారు. దీనిని పరీక్షించేందుకు 2022 నవంబర్ 20న ఓ నమూనాను విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూజర్ అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇస్తుంది. యూజర్ కావాల్సిన కొన్ని ఇన్ పుట్స్ ఇస్తే వాటికి కచ్చితమైన సమాధానం ఇస్తుంది.
2023 మే నెలలో దీనిని ఆవిష్కరించి ముందుగా ఐవోఎస్ లో మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. వచ్చే వారం నుంచి దీనిని అండ్రాయిడ్ యూజర్లను కూడా వాడుకునే విధంగా రెడీ చేశారు. ఈ మేరకు చాట్ జీపీటీ సీటీవో Mra Murati అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉన్న చాట్ జీపీటీ సేవలను ఆండ్రాయిడ్ వినియోగదారులకు సులభతర సేవలు అందించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపింది.
చాట్ జీపీటీ రిజిస్ట్రేషన్ కోసం.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి చాట్ జీపీటీ అని సెర్చ్ చేయాలి. ఆ తరువాత అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదిలా ఉండగా గత మేలో అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీని కేవలం రెండు నెలల్లోనే 100 మిలియన్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. తొలుత వెబ్ అప్లికేషన్ గా వచ్చినప్పటికీ ఈ ఏడాది మేలో ఐ ఫోన్ యూజర్లు వాడుతున్నారు.