https://oktelugu.com/

Good Habits: ఈ గుడ్ హ్యాబిట్స్‌తో ఆరోగ్యం మీ సొంతం.. ఇంతకీ ఏం చేయాలంటే?

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే హోమ్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయడం ఇవే కా దు. డైలీ మన లైఫ్‌లో కూడా కొన్ని మంచి అలవాట్లు ఉండాలి. అలవాట్లను పాటించకపోతే ఎంత పోషకాలు ఉండే ఆహారం తీసుకుని, వ్యాయామం చేసిన శారీర, మానసిక ఆరోగ్యం రాదు. అయితే ఆరోగ్యమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే ప్రతీ ఒక్కరికి కూడా కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. మరి అవేంటో తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 3, 2025 / 11:41 PM IST

    Good habits

    Follow us on

    Good Habits:శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే హోమ్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయడం ఇవే కా దు. డైలీ మన లైఫ్‌లో కూడా కొన్ని మంచి అలవాట్లు ఉండాలి. అలవాట్లను పాటించకపోతే ఎంత పోషకాలు ఉండే ఆహారం తీసుకుని, వ్యాయామం చేసిన శారీర, మానసిక ఆరోగ్యం రాదు. అయితే ఆరోగ్యమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే ప్రతీ ఒక్కరికి కూడా కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. మరి అవేంటో తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి.

    రోజూ ఒకే సమయానికి లేవడం
    కొందరు పని బట్టి ఉదయం లేస్తారు. ఉదాహరణకు పొద్దున్న సమయంలో ఏదైనా పని లేదా కాలేజ్, స్కూల్ ఉంటే తొందరగా లేస్తారు. అదే సెలవు అయితే 10 గంటల వరకు నిద్రపోతారు. ఇలా స్లీప్‌ను సెట్ చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ప్రతీ రోజు ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి లేవాలని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.

    ధ్యానం తప్పనిసరి
    చాలా మంది ఉదయం లేచిన తర్వాత మొబైల్ చూడటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ ఉదయం లేచిన తర్వాత ధ్యానం, యోగా వంటివి చేయాలి. రోజూ ఒకే సమయానికి ఒక పది నిమిషాల పాటు శ్వాస తీసుకుంటూ మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోగలరు. మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. సమయం లేకపోయిన సెట్ చేసుకుని మరి ఒక పది నిమిషాలు అయిన కూడా మెడిటేషన్ చేయాలని నిపుణులు అంటున్నారు.

    శారీరక శ్రమ తప్పకుండా ఉండాలి
    బాడీకి విశ్రాంతి ఎంత ముఖ్యమో.. శారీరక శ్రమ కూడా అంతే ముఖ్యం. శారీరక శ్రమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఎండార్ఫిన్‌ల విడుదల చేయడాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి రోజూ కూడా వాకింగ్, రన్నింగ్ వంటివి చేయడం మొదలు పెట్టండి. కనీసం 30 నిమిషాలు అయిన చేయడం వల్ల మీరు ఆందోళన, ఒత్తిడి సమస్యల నుంచి విముక్తి పొందుతారు.

    ఒకేసారి ఎక్కువగా చేయవద్దు
    తొందరగా అవుతుందని కొందరు పనిని ఎక్కువగా చేస్తుంటారు. ఇలా చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏ పనిని అయిన కూడా స్మార్ట్‌‌గా చేయడం అలవాటు చేసుకోవాలి. దీంతో మీకు ఒత్తిడి ఉండదు. ఆందోళన కూడా తగ్గుతుంది. ఈజీగా పని అవుతుంది.

    హైడ్రేటెడ్‌గా ఉండండి
    పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు వాటర్‌ కూడా ఎక్కువగా తీసుకోవాలి. బాడీ డీహైడ్రేట్ అయితే ఏకాగ్రత దెబ్బతింటుంది. దీంతో మానసికంగా ఇబ్బంది పడతారు. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగడం, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.

    విరామాలు తీసుకోవాలి
    విరామం తీసుకోకుండా వర్క్ చేయవద్దు. మీ బాడీకి కావాల్సిన రెస్ట్ ఉంటేనే సరిగ్గా వర్క్ చేయగలరు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. విరామాలు లేకుండా ఎక్కువ పని చేయడం వల్ల బర్న్ అవుట్, ఒత్తిడి, మానసిక అలసట ఏర్పడుతుంది. మీ మెదడుకు రీఛార్జ్ చేయాలంటే కాస్త సమయం విరామం ఇవ్వాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.