https://oktelugu.com/

Gond Katira: ఈ అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటూ.. గోండ్ కటిరా తినాల్సిందే!

గోండ్ కటిరా వాడటం వల్ల ఎలాంటి సమస్యలు అయిన కూడా తక్కువ రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. మరి ఈ గోండ్ కటిరాను ఎలా వాడితే ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2024 / 03:21 AM IST

    Gond Katira

    Follow us on

    Gond Katira: జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం వల్ల చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. మందులు వాడుతుంటారు. అయిన కూడా కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందలేరు. ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం కాకుండా బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు ఉండే ఆహారం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. లేకపోతే ఈ సమస్య తీవ్రం అవుతుంది. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోకపోతే జీర్ణ క్రియ కూడా దెబ్బతింటుంది. దీంతో కడుపు సంబంధిత సమస్యలు అన్ని కూడా వస్తాయి. ఈ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందాలంటే తప్పకుండా గోండ్ కటిరా వాడాల్సిందే. దీన్ని వాడటం వల్ల ఎలాంటి సమస్యలు అయిన కూడా తక్కువ రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. మరి ఈ గోండ్ కటిరాను ఎలా వాడితే ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    గోండ్ కటిరాను గమ్ కటిరా అని కూడా అంటారు. దీనికి రుచి, రంగు ఉండదు. కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని ఎక్కువగా వేసవిలో వాడుతుంటారు. ఇందులో ప్రొటీన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడటంతో పాటు శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది. దీన్ని వేప చెట్లు నుంచి సేకరిస్తారు. ఈ గోండ్ కటిరాతో మలబద్ధకం సమస్య ఈజీగా తగ్గుతుంది. దీన్ని ఒక గ్లాసు నీటిలో చక్కెర వేసుకుని తాగితే వారం రోజుల్లోనే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఎవరి బాడీ అయితే బాగా వేడిగా ఉంటుందో.. అలాంటి వారు రోజూ ఈ వాటర్‌ను తాగితే కేవలం వారం రోజుల్లోనే మీ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందుతారు. కొందరు దీన్ని లడ్డూలు కూడా తయారు చేసి తింటారు. వీటితో తయారు చేసిన పదార్థాలు తినడం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

     

    వేసవిలో కొందరు కాళ్లు, చేతులు మంట, వడదెబ్బతో ఇబ్బంది పడుతుంటారు. దీని నుంచి విముక్తి చెందాలంటే గోండ్ కటిరాను ఉపయోగించాలి. ఇది శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో తొందరగా బరువు తగ్గుతారు. అలాగే గోండ్ కటిరా జీవక్రియను కూడా వేగవంతం చేస్తుంది. పురుషులు, మహిళల్లో ఉండే సమస్యలను అన్నింటిని కూడా తగ్గిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు, ఉబ్బరం, గ్యాస్, అపానవాయువు వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. ఈ గోండ్ కటిరా వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య ఈజీగా తగ్గుతుంది. డెలివరీ తర్వాత కొందరు మహిళలు నీరసంగా ఉంటారు. అలాంటి వారు దీన్ని తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.