Jobs In Shipyard: గోవా షిప్‌యార్డు లిమిటెడ్ అనుభవం ఉన్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 63 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ డిప్లొమా/తత్సమాన కోర్సు పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆఫ్‌లైన్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Bollywood Actress: ఆ అందాల తార అద్దంలో మొహం కూడా చూసుకోలేకపోయింది !
సంస్థ గోవా అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. https://goashipyard.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం మార్చి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుందని తెలుస్తోంది.
నిరుద్యోగులు వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎక్కువ సంఖ్యలో వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
Also Read: Pawan Kalyan vs YCP: పవన్ ‘ప్రకటన’ను తప్పు దారి పట్టిస్తున్న వైసీపీ