Ghee: ఈ సమస్యలు ఉన్నవారు నెయ్యి తిన్నారో.. ఇక అంతే సంగతులు

నెయ్యి ఆరోగ్యానికి మంచిదే. కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు నెయ్యి తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : November 2, 2024 8:10 pm

Ghee

Follow us on

Ghee: నెయ్యిని డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు మెండుగా ఉండే నెయ్యి ఆరోగ్యానికి చాలామంచిది. పరగడుపున రోజూ ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. కేవలం ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మం, జట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయని భావిస్తుంటారు. అయితే రోజూ నెయ్యి తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదు. అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. నెయ్యిని మితంగా మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కూడా కలిగిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమయ్యే ప్యాంక్రయాటిక్ కణాలను నెయ్యి తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే నెయ్యి ఆరోగ్యానికి మంచిదే. కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు నెయ్యి తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

నెయ్యిలోని పోషకాలు వల్ల తొందరగా బరువు పెరుగుతారు. అయితే ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు నెయ్యిని తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ నెయ్యిని తినడం వల్ల ఎక్కువగా బరువు పెరుగుతారు. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా నెయ్యికి దూరంగా ఉండాలి. కొందరు అజీర్తీ, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు నెయ్యి తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే నెయ్యి అంత తొందరగా జీర్ణం కాదు. దీనివల్ల ఎక్కువగా కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా నెయ్యిని తినడం అంత మంచిది కాదు. నెయ్యి వల్ల కాలేయ వ్యాధిని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి లివర్ సిరోసిస్, హెపటైటిస్, హెపటో మొగలీ రోగులు నెయ్యిని తినడం మానేయడం బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

కొంతమందికి మిల్క్ ప్రొడక్ట్స్ వల్ల అలర్జీ వస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా నెయ్యిని తినకపోవడం మంచిది. అలర్జీ ఉన్నవారు నెయ్యిని తినడం వల్ల మంట, దద్దుర్లు, వాపు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెయ్యిలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అలెర్జీ సమస్యలను పెంచుతుంది. కాబట్టి అలర్జీ సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండటం బెటర్. ముఖ్యంగా గర్భిణులు అయితే నెయ్యిని అసలు తీసుకోకూడదు. నెయ్యిలో ఎక్కువగా రెటినాల్ టాక్సిసిటీ ఉంటుంది. ఇది అనారోగ్య బారిన పడేలా చేస్తుంది. డాక్టర్ పర్మిషన్‌తోనే గర్భిణులు నెయ్యిని తీసుకోవాలి. అలాగే గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్లు కూడా నెయ్యిని తీసుకోకపోవడం ఉత్తమం. నెయ్యిలోని అధిక కొలెస్ట్రాల్‌ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండటం ఉత్తమం.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.