Ghee: నెయ్యి తినడం వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుందా?

ఆరోగ్యానికి మేలు చేసే నెయ్యిని తీసుకోవడం వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత? ఎలా నెయ్యిని తినడం వల్ల మధుమేహం తగ్గుతుందో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 28, 2024 9:56 pm

Ghee

Follow us on

Ghee: ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే సరైన డైట్ పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. పెద్ద సమస్య కాదని కొందరు ఫీల్ అవుతుంటారు. కానీ షుగర్ ఉంటే ఇతర ఏ సమస్య వచ్చిన సీరియస్ అవుతుంది. చిన్నగా ఉన్న సమస్యను మీరే పెద్దది చేసుకున్న వారు అవుతారు. అయితే తినే ఆహారంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఆహార విషయంలో సరిగ్గా నియమాలు పాటించకుండా, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. దీనికి తోడు సాఫ్ట్ డ్రింక్స్, మద్యపానం, ధూమపానం, ఆర్టిఫిషియల్ షుగర్ వంటివి తీసుకోవడం వల్ల చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఆహార విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మధుమేహం తీవ్రం అవుతుంది. ఈ సమస్య పెరిగితే కొన్నిసార్లు ఆరోగ్యానికే ప్రమాదం. అయితే ఆరోగ్యానికి మేలు చేసే నెయ్యిని తీసుకోవడం వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత? ఎలా నెయ్యిని తినడం వల్ల మధుమేహం తగ్గుతుందో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

 

నెయ్యిని డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు నెయ్యి తింటే ఇన్సులిన్ పెరుగుతుందని భావిస్తారు. కానీ నెయ్యి వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుంది. అయితే నెయ్యి తినడం వల్ల మధుమేహం తగ్గుతుందని ఎక్కువగా తినకూడదు. మధుమేహం ఉన్నవారు రోజుకి కేవలం ఒక స్పూన్ నెయ్యిని మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి. దీంతో మళ్లీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. నెయ్యిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కూడా కలిగిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమయ్యే ప్యాంక్రయాటిక్ కణాలను నెయ్యి తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

 

పోషకాలు మెండుగా ఉండే నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. పరగడుపున రోజూ ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. కేవలం ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మం, జట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయని భావిస్తుంటారు. అయితే రోజూ నెయ్యి తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తక్కువగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. కొందరు వేడి నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుందని వేడి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అందులో హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. కాబట్టి నెయ్యిని మితంగా మాత్రమే తీసుకోండి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.