Head Massage: తలనొప్పి, తలనొప్పి, తలనొప్పి.. ఇది వచ్చిందంటే చాలు ఏ పని చేయలేం. ఎటు వెళ్లలేం, ఏది తినలేము కూడా. ఒక్కసారి తలనొప్పి మొదలైందంటే.. దాని పరిణామాలు చాలా ఉంటాయి. అందుకే చాలా మంది తలనొప్పి రాగానే మసాజ్ చేయించుకోవాలి అనుకుంటారు. మసాజ్ చేయడం వల్ల మంచి రిలాక్సేషన్ గా అనిపిస్తుంటుంది. దీంతో మసాజ్ మస్ట్ అనుకుంటారు. ఇక కొందరికి వ్యసనం గా మారుతుంటుంది కూడా. కానీ ఈ మసాజ్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసా? అయితే ఓ సారి లుక్ వేయండి..
ఈ మధ్య హెడ్ మసాజ్ చేసుకోవడానికి పక్కన ఎవరు లేకపోతే మసాజ్ మిషన్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ రేటు ఉండడంతో చాలా మంది వీటిని ఖరీదు చేస్తున్నారు. అలా ఈ మధ్య హెడ్ మసాజ్ కు చాలా మంది బానిసలు అవుతున్నారు. ఇక దీని వల్ల నష్టాలే ఎక్కువ. అయితే తరచూ మసాజ్ చేస్తే దాని ప్రభావం ప్రమాదకరంగా ఉంటుంది. రోజూ హెడ్ మసాజ్ చేస్తే అది తీవ్రమైన వ్యసనంగా మారుతుందట. మసాజ్ కు అలవాటు పడితే అది అందనప్పుడు నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.
కొందరికి జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. ఇక ఈ మసాజ్ చేయడం వల్ల చాలా మందికి జుట్టు కూడా రాలుతుంటుంది. అందుకే కాస్త మసాజ్ కు దూరంగా ఉండడమే మంచిది. ఇక సాధారణంగా జుట్టు రాలే సమస్యతోటి బాధపడే వారు మసాజ్ వల్ల మరింత సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి జుట్టు కూడా రాలకుండా ఉండాలంటే ఈ హెడ్ మసాజ్ లకు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే మసాజ్ వల్ల జుట్టులో తేమ పెరిగి జిడ్డుగా మారుతుంది. అందుకే నో హెడ్ మసాజ్ అనుకోండి
హెడ్ మసాజ్ వ్యసనం నరాలపై ఒత్తిడి చూపిస్తుంది. అందు వల్ల మసాజ్ ను అరుదుగా చేసుకోవాలి. ఇక రిలాక్స్ గా ఉంటుంది అని చేసుకునే ఈ మసాజ్ కు కాస్త దూరంగా ఉండడమే మంచిది అని గుర్తు పెట్టుకోండి. మీ హెడ్ ను సురక్షితంగా ఉంచుకోండి.