Fruits : కోరికలను పెంచే ఈ పండ్ల గురించి తెలుసా?

పడక సుఖం అనేది మనసుకు సంబంధించినంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.

Written By: Chai Muchhata, Updated On : March 5, 2024 3:42 pm
Follow us on

Fruits :  జీవితంలో ప్రతి ఒక్కరూ పడక సుఖం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండడం ద్వారా మనసు ప్రశాంతంగా మారడమే కాకుండా శరీరం ఆరోగ్యంగానూ ఉంటుంది. దీంతో ఈ సమయం కోసం ఎదురుచూస్తారు. అయితే చాలా మంది ఇందులో ఎంజాయ్ చేయడానికి గదిలోకి వస్తారు. కానీ అనుకున్నంతగా చేయలేదు. అందుకు కారణం పౌష్టికాహార లోపమే నని కొందరు వైద్యులు నిర్దారించారు. పడక సుఖం అనేది మనసుకు సంబంధించినంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.

పండ్లు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది వైద్యులు చెబుతుంటారు. రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాపిల్స్. ఇందులో క్వెర్సెటిన్ అనే ప్లేవనాయిడ్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణలో ఎలాంటి ఆటంకాలు లేకపోతే అంగ స్తంభన సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో అనుకున్నంత సేపు ఎంజాయ్ చేస్తారు.

ఎక్కువగా నీటిశాతం ఉండే పండ్లల్లో పుచ్చకాయ ఒకటి. ఇందులో ఎల్ సిట్రుల్లైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎల్ ఆర్జినైన్ గా మారుతుంది. అంటే ఎటువంటి అంగసమస్యలు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా కోరికలను పెంచడంలో ఈ పండు ఎంతో సహాయపడుతుంది. శరీరంలో నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచడంలో ఇది సాయ పడుతుంది.

మార్కెట్లో అన్ని కాలాల్లో లభించేది అరటిపండు. ఇది ఎలాంటి ఒత్తిడి ఉన్నా తగ్గిస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా జననేంద్రియాల భాగాలకు రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. అరటిపండుతో పాటు దానిమ్మ కూడా జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండడానికి సహాయపడుతుంది. దానిమ్మలో రక్తం గడ్డకట్టకుండా యాక్సిడెంట్లు ఉంటాయి. దీంతో అంగ సమస్యలు రాకుండా ఉంటాయి.