https://oktelugu.com/

Food Cost: వామ్మో ఒకపూట భోజనం ఖరీదు ఇంతా.. ఏ హోటల్‌లో అంటే?

దేశంలో తాజ్ హోటల్స్ చాలా ప్రత్యేకమైనవి. లైఫ్‌లో ఒక్కసారైన ఇలాంటి హోటల్స్‌లో భోజనం చేయాలని కోరుకుంటారు. మరి ఈ తాజ్ హోటల్‌ ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఒక్క పూట భోజనం కూడా చాలా ఖరీదైనదో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 4, 2024 / 05:30 PM IST

    Taj Hotel

    Follow us on

    Food Cost: దేశంలో ఎన్నో స్టార్ హోటల్స్ ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి హోటల్స్‌లో భోజనాలు చాలా కాస్ట్ ఉంటాయి. ఇలాంటి హోటల్స్‌లో ఒక్క పూట భోజనం చేయాలంటే మధ్య తరగతి వాళ్లు చేయాలేరని అంటుంటారు. అయితే అందరికీ తాజ్ హోటల్ గురించి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ హోటల్స్ చాలా ఫేమస్. వీటి గురించి తెలియని వారు కూడా ఎవరూ ఉండరు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రతన్ టాటాకి చెందినది ఈ హోటల్. అయితే రతన్ టాటాకి సామాన్యుల కోసం చాలా తక్కువ ఖరీదులోనే అన్ని వస్తువులను తీసుకొస్తారు. కానీ ఈ హోటల్‌లో భోజనాన్ని మాత్రం తక్కువగా తీసుకురాలేదు. ఎందుకంటే ఈ హోటల్ భోజనం చాలా ప్రత్యేకమైనది. మధ్య తరగతి ప్రజలు ఈ హోటల్‌లో ఒక పూట భోజనం చేయాలంటే కష్టమే. ఎందుకంటే నెల మొత్తం సంపాదన అంతా ఒక్క పూట భోజనంతోనే అయిపోతుంది. దేశంలో తాజ్ హోటల్స్ చాలా ప్రత్యేకమైనవి. లైఫ్‌లో ఒక్కసారైన ఇలాంటి హోటల్స్‌లో భోజనం చేయాలని కోరుకుంటారు. మరి ఈ తాజ్ హోటల్‌ ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఒక్క పూట భోజనం కూడా చాలా ఖరీదైనదో ఈ స్టోరీలో చూద్దాం.

    దేశంలో ఉన్న ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్స్‌లో తాజ్ హోటల్ ఒకటి. ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. దీన్ని ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మిచారు. 1903లో నిర్మించిన ఈ హోటల్‌కి మొదటిగా తాజ్ మహల్ హోటల్‌గా స్టార్ట్ చేశారు. ఈ హోటల్‌లో భోజనం చాలా నాణ్యతతో ఉంటుంది. అందుకే ఒక్కపూట భోజనం కూడా చాలా ఖరీదైనది. ఈ హోటల్‌లో ఒక్క పూట భోజనం చేయాలంటే రూ.13000 ఖర్చు అవుతుంది. శీతల పానీయాలు ఆర్డర్ చేస్తే రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చు అవుతుంది. ఇంకా మద్యం అవి సేవించాలంటే ఒక్కో బ్రాండ్ బట్టి రేటు మారుతుంది. కేవలం ఒక పూట భోజనం ఖరీదు మాత్రమే ఇదే. ఈ హోటల్‌లో మొత్తం 600 గదులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 1600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

    తాజ్ హోటల్‌ను 1902లో జామ్‌ సెట్టీ టాటా స్థాపించారు. మొదటిగా ముంబైలో స్థాపించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా స్థాపించారు. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌గా, జైపూర్‌లోని రాంబాగ్ ప్యాలెస్‌గా, ఉదయపూర్‌లోని తాజ్ లేక్ ప్యాలెస్‌గా, జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌గా, హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌గా, చెన్నైలోని తాజ్ కోరమాండల్‌గా, బెంగుళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్, గోవాలోని తాజ్ ఫోర్ట్ అగుడా రిసార్ట్, చెన్నైలోని తాజ్ కన్నెమారా, కోల్‌కతాలోని తాజ్ బెంగాల్, గ్వాలియర్‌లోని ఉషా కిరణ్ ప్యాలెస్, చెన్నైలోని , తాజ్ క్లబ్ హౌస్ చెన్నైతాజ్ మత్స్యకారుల కోవ్ రిసార్ట్ అండ్ స్పా, కోయంబత్తూరులోని తాజ్ సూర్య, థింఫులో తాజ్ తాషి, కోల్‌కతాలోని తాజ్ సిటీ సెంటర్, కోల్‌కతాలోని తాజ్ తాల్ కుటీర్‌గా దేశ వ్యాప్తంగా ఉన్నాయి.