Eye Care Tips: ఇటీవల కాలంలో కంటి జబ్బులు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల్లో సైతం కంటి సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే కళ్లజోడు ధరించాల్సి వస్తోంది. దీంతో కళ్లకు సంబంధించి సమస్యలు జీవితాంతం వారిని వెంటాడుతున్నాయి. దీనికి కారణం మన ఆహార అలవాట్లే. సరైన పోషకాలు లేని ఆహారాలతో ఆరోగ్యాలు దెబ్బతినడం సహజమే. కళ్లకు సంబంధించిన సమస్యలు రావడానికి మనం ఆకుకూరలు సరిగా తినకపోవడమే. ఆకుకూరల్లో మంచి ప్రొటీన్లు ఉంటాయి.
కంటి జబ్బులు ఎందుకొస్తున్నాయి
కళ్లకు సంబంధించిన జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఫోన్లు. స్ర్రీన్ ను ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి జబ్బులు వస్తున్నాయి. ఇంకా ఈ రోజుల్లో అందరు కంప్యూటర్ల ముందు కూర్చునే పనిచేస్తున్నారు. అందుకే కంటి జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటోంది. ఇంకా టీవీలు కూడా చూస్తున్నారు. ఇలా మన కళ్లు దెబ్బతినడానికి ఇవన్నీ కారణాలుగా ఉంటున్నాయి.
జుకినితో ప్రయోజనం
కంటికి సంబంధించిన జబ్బులు ఉన్నట్లయితే జుకిని మంచి ఉపయోగకరంగా ఉంటుంది. జుకిని వెజిటబుల్ కంటి పైపొరను కాపాడి కంటి చూపు మెరుగుపడేందుకు సాయపడుతుంది. దీన్ని సలాడ్ గా చేసుకుని తినొచ్చు. జ్యూస్ గా చేసుకుని తాగవచ్చు. ఇందులో మిరియాల పొడి కలుపుకుని తీసుకోవాలి. లేదా పెరుగు చట్నీలో కలుపుకుని కూడా తాగొచ్చు.
కంటిచూపు మెరుగుదల
కంటి చూపు మెరుగుదలకు జుకిని సాయపడుతుంది. కంటి పైపొరన రెటీనాను కాపాడుతుంది. మన శరీరాన్ని చల్లబరచడంలో ఇది దోహదపడుతుంది. డయాబెటిస్ కారణంగా చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. జుకినిలో ఉండే మాంగనీసు, టుటీన్, జియాక్రంతిన్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటంతో కంటి జబ్బులను నయం చేస్తుంది.