spot_img
Homeలైఫ్ స్టైల్Flower Weaving Machines: ఇక మనుషులు పని చేయక్కర్లేదు.. చివరికి పూలనూ వదల్లేదు

Flower Weaving Machines: ఇక మనుషులు పని చేయక్కర్లేదు.. చివరికి పూలనూ వదల్లేదు

Flower Weaving Machines: ఆడవాళ్లకు వస్త్రాల తర్వాత ఆ స్థాయిలో అలంకరణకు పనికివచ్చేవి పువ్వులు. పూలను ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా తమ జడలలో పెట్టుకుంటారు. రకరకాల అల్లికలతో పూలకు మరింత అందాన్ని తీసుకొస్తారు. తమ కొప్పులలో పెట్టుకొని అందానికి సరికొత్త రూపాన్ని ఆవిష్కరిస్తారు.

కొప్పులో దాగిన పువ్వు.. ఎన్నెన్నో అందాలకు నెలవు.. అన్నాడు వెనుకటికి ఓ కవి. దీనినిబట్టి మహిళలు పువ్వులకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూలల్లో రకరకాల ఉన్నట్లే.. అల్లికల విషయంలో కూడా అదే స్థాయిని మహిళలు కొనసాగిస్తుంటారు.

పూలను అలంకరణకు ఉపయోగిస్తారు. ఆలయాలలో వేడుకలు జరిగినప్పుడు.. గృహాలలో శుభకార్యాలు జరిగినప్పుడు.. చివరికి అశుభకార్యాలు జరిగినప్పుడు కూడా పూలను వాడుతుంటారు. పూలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విధంగా.. అల్లిక చేసినప్పుడు మరొక విధంగా కనిపిస్తాయి. అందువల్లే భారతీయులు ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు పూలను అల్లడంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు మహిళలైతే పూలను అల్లే విషయంలో విభిన్న తత్వాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

పూలను అల్లడం అనేది ఒక కళ. అది అందరికీ సాధ్యం కాదు. అయితే ఈ యాంత్రికరణ అనేది అన్ని విషయాలలో జరిగినట్టు.. పూలను అల్లే విషయంలో కూడా యాంత్రికరణ చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో పూలను అల్లడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఆ యంత్రాలు అచ్చం మనుషుల మాదిరిగానే పూలను అల్లుతున్నాయి. బిజీగా ఉండే మార్కెట్లో పూల వ్యాపారులు ఈ యంత్రాల ద్వారా.. విరులను అల్లుతున్నారు. తద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. పూలను అల్లే మిషన్లు రావడంతో చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది అందుబాటులోకి వచ్చింది.. మిషన్ పూలను అల్లుతున్న తీరును వీడియో రూపంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే వచ్చే రోజుల్లో మనిషికి ఏమాత్రం పని చేసే అవకాశం లేకుండా పోతుందని.. బద్ధకం అనేది మనుషులకు ఇంకా అలవాటు అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular