Homeలైఫ్ స్టైల్Sprint Diagnostics Hyderabad: దక్షిణభారతదేశంలో మొదటిసారిగా అంతర్జాయతీయ ప్రమాణాలతో అత్యాధునిక డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించిన స్ప్రింట్...

Sprint Diagnostics Hyderabad: దక్షిణభారతదేశంలో మొదటిసారిగా అంతర్జాయతీయ ప్రమాణాలతో అత్యాధునిక డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

Sprint Diagnostics Hyderabad: దక్షిణభారతదేశంలో మొదటిసారిగా అంతర్జాయతీయ ప్రమాణాలతో అత్యాధునిక డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
స్థాపించిన మొదటి సంవత్సరంలోనే డయాగ్నోస్టిక్స్ సేవల్లో నాణ్యతా ప్రమాణాల ISO
(ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ ఆర్గనైజషన్ ) సర్టిఫికెట్ గుర్తింపు పొందిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యతిథిగా జిల్లా రిటైర్డ్ జడ్జి మరియు HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అడ్వైజరీ సలహాదారుడు సుందర్ రామయ్య గారు పాల్గొని ISO సర్టిఫికెట్ ని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ CEO వెంకటేష్ గారికి అందిచడం జరిగింది.

Sprint Diagnostics Hyderabad
Venkatesh, T Sundar Ramaiah, Dr Kancerla Srinivas, Dr Jithender reddy

*ప్రతి ఒక్కరికి నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలు అయినటువంటి జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఎల్‌బి నగర్, ఎఎస్ రావు నగర్ మరియు జెఎన్‌టియు ఈ ఐదు ప్రాంతాలల్లో మెట్రో స్టేషన్స్ కి దగ్గర్లో అత్యాధునిక డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.దక్షిణభారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ PET – స్కాన్, 3TESLA – మరి,160 స్లైస్ CT ,డిజిటల్ మామోగ్రఫీ , డ్యూయల్ హెడ్ గామా కెమెరా , DR X RAY , అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన HLA -టైపింగ్ మెషిన్ , ఫ్లోరో సైటోమెట్రీ ,మొలిక్యూలర్ బయాలజీ మొదలైన నిద్దరణ పరీక్షలను కావాల్సిన మౌలిక సదుపాయాలతో అతి తక్కువ సమయంలో కచ్చితమైన ఫలితాలనుఁ అందిచగలిగిన నైపుణ్యత స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సొంతం.

Also Read: PM Modi Australia: ఆస్ట్రేలియా నుంచి పురాతన విగ్రహాలు తెప్పించిన మోడీ సర్కార్..

ఈ సందర్భంగా ముఖ్యఅతిథి సుందర్ రామయ్య గారు మాట్లాడుతూ స్థాపించిన అతి కొద్దీ కాలంలోనే ఇది పొందటం వాళ్ళ యొక్క నాణ్యమైన సేవలకు నిదర్శనం.సరైన అత్యాధునిక సదుపాయాలను కలిగిన డయాగ్నోస్టిక్స్ ఎంచుకుంటేనే మనకు కచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అన్నారు మరియు డయాగ్నోస్టిక్స్ చరిత్రలో ఒక సమయంలో MRI , CT సౌకర్యాలతో ఒకే నగరంలో మెట్రో స్టేషన్‌లకు ,ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఈ ఐదు కేంద్రాలు.

ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ CEO – వెంకటేష్ గారు మాట్లాడుతూ భారతదేశంలో ఒకేసారి ఒకేసమయంలో ఒకే నగరంలో MRI , CT లతో ఐదు ప్రదేశాల్లో ఒకేసారి ప్రాంభించడం అది మన హైదరాబాద్ లో కావడం మనందరి గర్వకారణం.

Sprint Diagnostics Hyderabad
Venkatesh, T Sundar Ramaiah, Dr Kancerla Srinivas, Dr Jithender reddy

స్థాపించిన కొద్దిరోజుల్లోనే మా క్వాలిటీ సేవలను గుర్తించి మాకు ISO సర్టిఫికెట్ అందించినందుకు చాలా సంతోషిస్తున్నాము.ఈ సర్టిఫికేషన్ అనేది స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ యొక్క గుర్తింపుగా మాత్రమే కాకుండా, స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ద్వారా అమలు చేయబడిన అత్యధిక నాణ్యత ప్రమాణాలకు గుర్తింపు. అన్ని రోగనిర్ధారణ అవసరాలను తీర్చడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పేషెంట్ యొక్క అవసరాలకు అనుగుణంగా తక్కువ సమయంలోనే అన్ని సేవలను అందించటమే మా కర్తవ్యం.మా యందు ఎక్కువ సేపు మీరు మీ సమయాన్ని వృదాచేసుకోకుండా అతి కొద్దిగా సమయంలోనే మీకు నాణ్యమైన సేవలను అందిస్తున్నాం.

అత్యాధునిక సదుపాయాలతో పాథాలజీ , లేబొరేటరీ సేవలు మరియు CT – MRI మరియు కాన్సర్ ని పరీక్షించే PET -CT స్కాన్ పరికరాలతో అతి కొద్దినిమిషాలలోనే మీకు మీ రిపోర్ట్స్ అందిచడం జరుగుతుంది కేవలం ఇవన్ని మా దగ్గర ఉన్నటువంటి పరికరాలతోనే సాధ్యం అవుతున్నది. మా వద్ద అనుభవజ్ఞులైన మరియు ధృవీకరించబడిన రేడియాలజిస్ట్‌లు, పాథాలజిస్టులు, వైద్యులు మరియు పారామెడిక్ సిబ్బంది కలిగి ఉన్నాం. ఖచ్చితమైన మరియు సమయానుకూలమైన అన్ని రేడియాలజీ మరియు లేబొరేటరీ సేవలను అందించడానికి స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ నిరంతరం మీకు అందుబాటులో ఉంటుంది అని అన్నారు.

కాస్ట్రో ఫోబియా (ట్యూబ్ లోనికి వెళ్తున్నట్లు భయపడటం) ను అధిగమించడానికి MRI జరుగుతున్నప్పుడు వారికీ నచ్చిన సినిమా , సంగీతము వింటూ వారి భయాన్ని దరిచేరనీయక పరీక్షను పూర్తి చేసే అవకాశాన్ని భాగ్యనగరవాసులకి అందిస్తున్నది స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్.

Also Read: BJP vs KCR : కేసీఆర్ ముందరి కాళ్లకు ముందే బంధం వేసిన బీజేపీ

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular