Mineral water : వేసవి కాలం వచ్చేసింది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఇక ప్రయాణాల్లో అయితే మరింత ఎక్కువ నీళ్లు తాగుతాం. అయితే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగితే గొంతు పాడవుతుంది. కలుషిత నీరుతో వాంతులు విరోచనాలు అవుతాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు వాటర్ బాటిల్ కొని తాగుతుంటారు. బాటిల్ నీళ్లు చాలా శుభ్రమైనవని భావిస్తారు. అయితే, నీళ్ల వ్యాపారం కోట్ల రూపాయాల్లో సాగుతుండడంతో చాలా కంపెనీలు పుట్టుకొచ్చాయి. జనరల్ వాటర్‌నే బాటిళ్లలో నింపి మినరల్ వాటర్‌గా అమ్మేస్తున్నాయి.
నిజంగా మినరల్ వాటరేనా..
మీరు డబ్బులు పెట్టి కొని తాగే బాటిల్‌లో ఉన్నవి మినరల్ వాటరేనా అంటే చాలా మంది అవుననే అంటారు. కానీ చాలా మంది ఇలానే మోసపోతున్నారు. ఎందుకంటే కంపెనీళు జనరల్ వాటర్‌ను మినరల్ వాటర్‌గా అంటగడుతున్నాయి. అయితే మినరలా జనరలా ఇలా తెలుసుకోవచ్చు.
– వాటర్ బాటిల్ కొన్న వెంటనే ఐఎస్‌ఐ మార్కు ఉందా లేదా చూసుకోవాలి.
– తర్వాత ఐఎస్‌ఐ మార్కుపై ఐఎస్ : 14543 నంబర్ ఉందా లేదా చూసుకోండి.
– ఈ రెండు ఉంటే ఆ బాటిల్‌లోని నీళ్లు ప్యూర్ మినర్ వాటర్.
అనుమానం వస్తే..
ఐఎస్‌ఐ మార్కుతోపాటు 14543 నంబర్ ఉన్నా కూడా నీళ్లు మినరల్ కాదని డౌట్ వస్తే ఇలా చేయాలి. బీఐఎస్ కేర్ అనే యాప్ ఓపెన్ చేసి అందులో ఐఎస్‌ఐ వెరిఫై లైసెన్స్ డీటెయిల్స్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఐఎస్‌ఐ మార్కు కింద ఉన్న నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీంతో ఆ బాటిల్ ఏ కంపెనీకి చెందినది, ఎక్కడ తయారు చేశారు అనే వివరాలు తెలుస్తాయి. ఆ నీటిలో ఉన్న మినరల్స్, దాని లైసెన్స్, వ్యాలిడిటీ అన్ని వివరాలు కనిపిస్తాయి.
ఫిర్యాదు చేయవచ్చు..
మీరు కొన్నవాటర్ బాటిల్ ఫేక్ అని నిర్ధారణ అయితే బీఐఎస్‌కేర్ యాప్‌లోనే ఫిర్యాదు కూడా చేయవచ్చు. వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఫోన్‌లో బీఐఎస్ కేర్ యాప్ ఉంటే మనం తాగే నీళ్లు మంచివా కావా ఇట్టే తెలుసుకోవచ్చు.