https://oktelugu.com/

Fennel Seeds: సోంపు గింజలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా?

సోంపు గింజల గురించి అందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా వీటిని భోజనం తర్వాత తింటారు. హోటల్స్‌, రెస్టారెంట్లు, ఫంక్షన్‌లో ఈ సోంపు గింజలను ఉంచుతారు. వీటిని భోజనం తర్వాత తినడం వల్ల జీర్ణం అవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వాడుతారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 12, 2024 / 03:14 AM IST

    Fennel Seeds

    Follow us on

    Fennel Seeds: సోంపు గింజల గురించి అందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా వీటిని భోజనం తర్వాత తింటారు. హోటల్స్‌, రెస్టారెంట్లు, ఫంక్షన్‌లో ఈ సోంపు గింజలను ఉంచుతారు. వీటిని భోజనం తర్వాత తినడం వల్ల జీర్ణం అవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వాడుతారు. అందరి వంటింట్లో ఈ గింజలు ఉంటాయి. ఈ గింజలను డైలీ ఏదో విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని వంటల్లో కూడా వాడుతారు. దీనివల్ల వంటలు టేస్టీగా ఉండటంతో పాటు నోటిని కూడా శుభ్రపరుస్తాయి. అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తాయి. పూర్వ కాలంలో అయితే వీటి మొక్కలను కూడా పెంచుకునేవారు. కానీ ఇప్పుడు అసలు ఈ మొక్కలే కనిపించడం లేదు. వీటిని మార్కెట్లో కొనుక్కుంటున్నారు. వీటిపై షుగర్ ఉన్నవే మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి. సాధారణ సొంపు గింజలను డైలీ వంటల్లో వాడటం, తినడం వంటివి చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మరి అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం పూర్తిగా చదివేయండి.

    డయాబెటిస్ క్లియర్
    ఈ రోజుల్లో చాలా మంది మధుమేహం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు సోంపు గింజలను వాటర్ లేదా వంటల్లో వేసుకుని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే సమస్య కూడా తగ్గుతుంది. సోంపు గింజల్లోని ఫైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా ఈ గింజలను తీసుకోవడం మంచిది.

    జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం
    సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. అలాగే అపానవాయువు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను కూడా క్లియర్ చేయడంలో సోంపు గింజలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

    దంతాల ఆరోగ్యం
    కొందరు దంతాల సమస్యలతో ఎక్కువగా పోరాడుతుంటారు. అలాంటి వారికి సోంపు గింజలు బాగా సహాయపడతాయి. ముఖ్యంగా నోటి దుర్వాసన క్లియర్ అవుతుంది. దంత క్షయాన్ని నివారించడంతో పాటు నోటి నుంచి వచ్చే దుర్వాసన అంతా పోతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.

    చర్మ ఆరోగ్యం
    సోంపు గింజల్లోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే ముఖంపై ఉండే మొటిమలు, చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి.

    కళ్ల ఆరోగ్యం
    కంటి చూపును మెరుగుపరచడంలో సోంపు గింజలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే కంటి శుక్లం వంటి సమస్యలను కూడా నివారిస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించడంతో పాటు హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి.

    ఎలా తీసుకోవాలంటే?
    భోజనం తర్వాత సోంపు గింజలను నమలడం, సోంపు వాటర్ చేసి తాగడం, టీ లేదా వంటల్లో ఉపయోగించాలి. ఇలా చేసి తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.