Fatty Liver: హైదరాబాదులోని అత్యాధునిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీకి వస్తున్న ప్రతి 10 మందిలో నలుగురు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ పడుతున్నారు. అలాగని ఇది కేవలం హైదరాబాద్ లో వారికి మాత్రమే పరిమితం కాలేదు. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల దాకా అంతటా ఇదే పరిస్థితి ఉంది. వాస్తవానికి ఫ్యాటీలివర్ మూడో దశలో క్యాన్సర్‌గా మారే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్, ప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఈ సమస్యకు సమర్థ చికిత్సనందించే నాష్ క్లినిక్‌ను ప్రపంచంలోనే తొలిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

చాప కింద నీరులా ఫ్యాటీ లివర్
పల్లెల్లో 20%.. పట్టణాల్లో 25% మందిలో ఫ్యాటీలివర్ సమస్య ఉన్నట్టు ఏఐజీ ఇంటింటి సర్వేలో వెల్లడయింది. నానాటికీ పెరిగిపోతున్న ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ సమస్యకు వివిధ విభాగాల నిపుణులతో సమర్థమైన చికిత్సనందించే నాష్ క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారి హైదరాబాద్‌లోని ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో ఏర్పాటైంది. ఫ్యాటీ లివర్ సమస్యను పూర్తిగా నయం చేసేలా నాష్ క్లినిక్‌లో ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెబుతున్నారు.
Also Read: Milk Flown Away: లాభమా..? నష్టమా..?: వంటింట్లో పాలు పొంగండం దేనికి సంకేతమో తెలుసా..?
దేశంలో ప్రతి పది మందిలో నలుగురు ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘వ్యాయామం లేకపోవడం, జీవన శైలి లోపాలు (వేళకు తిండి, నిద్ర లేకపోవడం), జంక్ ఫుడ్ తినడం తదితర కారణాలతో ఫ్యాటీ లివర్ వస్తుంది. ఈ సమస్యను తక్కువగా అంచనా వేయొద్దు. ఫ్యాటీ లివర్ ఒకటి, రెండు దశల్లో ఉన్నప్పుడు గుర్తిస్తే బరువు తగ్గించుకోవడం ద్వారా సామాన్యస్థితికి చేరొచ్చు. మూడో దశలో లివర్ గట్టి పడుతుంది. ఆ పరిస్థితిని నాష్ (నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్) అంటారు. ఆ స్థితిలో 10 % మందికి లివర్‌క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాటీ లివర్‌తోపాటు వచ్చే మధుమేహం కారణంగా చాలా నష్టం జరుగుతుంది. సమస్యను ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే సులభంగా కోలుకోవచ్చు’’అని వివరించారు. గతంలో తమ ఆస్పత్రికి వచ్చే ఔట్‌పేషెంట్లలో 5% మందికి మాత్రమే ఫ్యాటీ లివర్ సమస్య ఉండేదని.. ఇప్పుడు 29-30% మందికి ఉంటోందని ఆయన చెబుతున్నారు.
సర్వే ఫలితాలు ఇవీ
గ్రామీణ ప్రాంతాలలో పల్లెటూర్లలో గత ఏడాది నుంచి ఈ సర్వే కొనసాగుతోంది. పఠాన్‌చెరువు మండలంలోని వాడక్‌పల్లిలో సర్వేకు శ్రీకారం చుట్టారు. ఆ మండలంలోని గ్రామాలతోపాటు మరో 55 గ్రామాలలో సర్వే పూర్తయింది. మరిన్ని గ్రామాల్లో దీన్ని నిర్వహించనున్నారు. సర్వేలో భాగంగా ఏఐజీ సిబ్బంది, ఒక డాక్టర్ ఇంటింటికీ వెళ్లి ఒక్కొక్క గ్రామంలో దాదాపు 50-55 మందిని ఎంపిక చేసి ఆరోగ్య వివరాలు సేకరించారు. అనారోగ్యంతో బాధపడేవారికి అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ, స్కానింగ్, రక్త, మూత్రపరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపీ, స్కానింగ్, రక్తం, మూత్ర పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 20% మంది ఫ్యాటీ లివర్ బాధితులుండగా, పట్టణప్రాంతాల్లో వారి సంఖ్య 25 % దాకా ఉన్నట్టు సర్వేలో తేలింది.

10 శాతం బరువు తగ్గితే చాలు
10% బరువు తగ్గడం ద్వారా లివర్‌లో ఉన్న కొవ్వు కరిగి సాధారణ స్థితికి చేరే అవకాశముంది. అయితే అది మొదటి రెండు దశల్లో గుర్తిస్తేనే! నిర్లక్ష్యం చేస్తే మూడో దశకు చేరి, లివర్ గట్టిపడుతుంది. అది అలాగే కొనసాగితే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేస్తే మంచిది. కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, చికెన్, చేపలు తినాలి. స్వీట్లు, కూల్‌డ్రింక్స్ పూర్తిగా మానేయాలి.
Also Read:Rajamouli- Mahesh Babu: మహేష్ విషయంలో రాజమౌళి కన్ఫ్యూజ్ అవుతున్నారా?… ఆయన సెలక్షన్ బాగాలేదే!