Fasting: దేవుడు మీద భక్తితో చాలామంది ఉపవాసం చేస్తుంటారు. మరికొందరు ఫిట్‌గా ఉండటం కోసం ఉపవాసం చేస్తారు. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఉపవాసం ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే కొందరు పండ్లు, పాలు, జ్యూస్‌లు వంటివి తాగి ఉపవాసం చేస్తారు. కానీ మరికొందరు మాత్రం పూర్తిగా ఏం తినకుండా ఉపవాసం పాటిస్తారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అలా అని లిమిట్ లెస్‌గా చేయకూడదు. ఇలా చేస్తే తొందరగానే ప్రాణం లిమిట్ కూడా పోతుంది. ఎప్పుడో నెలకు ఒకసారి ఉపవాసం ఉంటే పర్లేదు. కానీ వారానికొకసారి ఉపవాసం ఉంటే తప్పకుండా ప్రమాదంలో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు ఏదైనా ముఖ్యమైన రోజు ఉంటే ఉపవాసం ఉంటారు. మళ్లీ తర్వాత రోజూ కూడా ఏదైనా పండుగ లేదా ఇంకోటి వస్తే కొందరు ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా 8 గంటల పాటు తినకుండా ఉన్నా పర్లేదు. కానీ అంత కంటే ఎక్కువ సమయం తినకుండా ఉంటే తలనొప్పి, బద్ధకం, క్రేంకినెస్, మలబద్ధకం, మైకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజూ ఫుడ్ తినేవాళ్లు ఇలా ఒక్కసారిగా ఎక్కువగా ఉపవాసం చేస్తే.. శరీరం కొత్త ఆహార శైలికి అలవాటు పడుతుంది. దీనివల్ల బాడీలో మార్పులు వస్తాయి. ఫస్ట్ కొన్ని రోజుల్లో తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసం ఉండకూడదు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భవతిగా ఉన్నవారు, బాలింతలు, వయస్సు పైబడిన వారు, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలా శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలతో కూడా బాధపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలా అడపాదడపా ఉపవాసం చేయవద్దు. ఎప్పుడో ఒకసారి ఉపవాసం చేయడం అలవాటు చేసుకోండి.
కొందరికి తెలియక ఉపవాసం చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. కేవలం అన్నం కాకుండా కొన్ని పదార్థాలను ఉపవాసం సమయంలో తీసుకుంటారు. వీటివల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు, పాల పదార్థాలు, రైతా, మిల్క్ షేక్స్ వంటివి ఉపవాసం సమయంలో తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి అంత తొందరగా జీర్ణం కావు. పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా కొవ్వు, ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వేగంగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. అలాగే కడుపు ఉబ్బరం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. సాధారణంగా బనానా షేక్ ఆరోగ్యానికి మంచిదే. దీన్ని తాగడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఇవి ఉపవాస సమయంలో అంతమంచిది కాదు. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.