https://oktelugu.com/

Fake Water bottle : వాటర్ బాటిల్ నకిలీదో, నాణ్యమైనదో కొన్నప్పుడే మొబైల్ ద్వారా ఇలా గుర్తించండి..

బాటిల్ కొన్న తరువాత దానిపై ఎలాగూ ISI మార్క్ ఉంటుంది. ఆ మార్క్ కింద ఒక నెంబర్ ఉంటుంది. ఇది ఉందో, లేదో తెలుసుకోవాలి. ఆ తరువాత మొబైల్ లోకి వెళ్లి.. BIS Car Appను డౌన్లోడ్ చేసుకోవాలి

Written By:
  • Srinivas
  • , Updated On : March 21, 2024 2:18 pm
    Fake Water bottle

    Fake Water bottle

    Follow us on

    Fake Water bottle : వేసవి కాలం సమీపిస్తోంది. ఇప్పుడు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. అయితే వీటితో సంబంధం లేకుండా కొన్ని కంపెనీలో వాటర్ బాటిళ్లను తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తుంటాయి. ఒకప్పుడు కొన్ని కంపెనీలు మాత్రమే వాటర్ బాటిళ్లను తయారు చేసిన ఎక్కువ ధరకు అమ్మేవారు. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు తక్కువ ధరకు వాటర్ బాటిళ్లు అందిస్తున్నాయి. అయితే రేట్ చాలా చీప్ అని కాకుండా ఆ బాటిల్ నకిలీదో, నాణ్యమైనదో తెలుసుకోవాలి. లేకుంటే ఆరోగ్యం పరంగా అవస్థలు పడాల్సి వస్తుంది.మరి ఆ వాటార్ బాటిల్ ను కొనుగోలు చేసిన వెంటనే మొబైల్ ద్వారా ఇలా గుర్తించవచ్చు..

    చాలా మంది ప్రయాణాలు చేసేవారు వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటారు.వారి అవసరాన్ని గుర్తించిన కొన్ని కంపెనీలు వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే కొన్ని ప్రముఖ బ్రాండ్ల పేరిట నకిలీ వాటర్ బాటిళ్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఇవి అచ్చం బ్రాండ్లలాగే కనిపిస్తాయి. కానీ అందులో ఉండే నీరు కలుషితంగా ఉంటుంది. దీనిని చాలా మంది గుర్తించకుండా తాగేస్తుంటారు. ఆ తరువాత తీవ్ర అనారోగ్య పాలవుతారు.

    ఇటువంటి పరిస్థితి రాకముందే కొనుగోలు చేసిన వాటర్ బాటిల్ నకిలీదో కాదో వెంటనే గుర్తించవచ్చు. ఇందులో కొసం మొబైల్ మాత్రమే అవసరం ఉంటుంది. బాటిల్ కొన్న తరువాత దానిపై ఎలాగూ ISI మార్క్ ఉంటుంది. ఆ మార్క్ కింద ఒక నెంబర్ ఉంటుంది. ఇది ఉందో, లేదో తెలుసుకోవాలి. ఆ తరువాత మొబైల్ లోకి వెళ్లి.. BIS Car Appను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత బాటిల్ పై ఉన్న ఐఎస్ ఐ కింద ఉన్న నెంబర్ ను యాప్ లో అడిగిన చోట ఎంటర్ చేయాలి.

    ఇప్పుడ ఆ బాటిల్ ఎక్కడ తయారు చేశారు? ఏ కంపెనీ దానిని మానుఫాక్చర్ చేసింది? ఎలా ఫిల్టర్ చేశారు? అనే వివరాలు వస్తాయి. అలాంటి వివరాలు ఏమీ రాకపోతే అది ఫేక్ బాటిల్ అని గుర్తించాలి. ఒకవేళ ఆ బాటిల్ ఫేక్ అయితే వెంటనే ఈ యాప్ లో ఉన్న కంప్లయింట్ ఆప్షన్ లోకి వెళ్లి డిటేయిల్స్ ఇవ్వాలి. దీంతో అది తయారు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారు. అందువల్ల ఎప్పుడు వాటర్ బాటిల్ కొనుగోలు చేసినా ముందుగా అది నకిలీదో కాదో గుర్తించండి..