https://oktelugu.com/

Fake Cashew :జీడిపప్పు నకిలీదో, కాదో ఇలాగుర్తించండి..

తెల్లజీడిపప్పు నాణ్యతలో అద్భుతమైనది. దీనిపై ఎలాంటి నలుపు మచ్చలు ఉండవు. కొన్ని జీడిపప్పులు నలుపు మచ్చలు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2024 4:40 pm
    Cashew Fake or Real

    Cashew Fake or Real

    Follow us on

    Fake Cashew: జీడిపప్పు అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇది రుచికరంగానే కాకుండా శరీరానికి హెల్తీగా కూడా ఉంటుంది. జీడిపప్పు అత్యధిక పోషకాలు కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఏదో విధంగా వంటల్లో జీడిపప్పును వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది దీనిని యూజ్ చేయడంలో తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే తక్కువ ధరకే విక్రయిస్తామని నాసిరకం జీడిపప్పును అంటగడుతుంటారు. జీడిపప్పులో నాణ్యమైనవి, నాసికమైన రెండు రకాలుగా ఉంటుంది. డ్రైఫ్రూట్స్ లో అన్నింటికంటే ఇది ఎక్కవ ధరను కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అయితే జీడిపప్పు నకిలీదో, నాణ్యమైనదో ఇలా గుర్తించవచ్చు.

    డ్రై ఫ్రూట్స్ లో నెంబర్ వన్ గా ఉండేది జీడిపప్పు మాత్రమే. దీనిని వంటల్లో కలుపుతుంటారు. ఒక్కోసారి నేరుగా తింటారు. కొన్నిసార్లు వేయించుకొని తింటూ ఉంటారు. జీడిపప్పును లడ్డు, పాయసం లాంటి వాటిల్లో వేసుకొని తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఒక్కోసారి నాసిరకం జీడిపప్పు వల్ల ఆహార పదార్థం రుచిని కోల్పోతుంది. అప్పుడు మిగతా పదార్థాలు కాకుండా జీడిపప్పు క్వాలిటీ లేదని గుర్తించాలి.

    సాధారణంగా జీడిపప్పు తెలుపు రంగులో ఉంటుంది. కానీ కొన్ని జీడిపప్పులు పసుపు పోలిన రంగులో ఉంటున్నాయి. ఇలా ఉంటే అది నాసిరకమైనది. తెల్లజీడిపప్పు నాణ్యతలో అద్భుతమైనది. దీనిపై ఎలాంటి నలుపు మచ్చలు ఉండవు. కొన్ని జీడిపప్పులు నలుపు మచ్చలు ఉంటాయి. ఇవి నకిలీవేనని తెలుసుకోవాలి. జీడిపప్పును తినడం వల్ల ఒక్కోసారి కొత్త రుచిని పొందుతాం. నకిలీ జీడిపప్పు రుచి వేరుగా ఉంటుంది. నకిలీ జీడిపప్పు తిన్నప్పుడు పిండిని నమిలిన ఫీలింగ్ కలుగుతుంది.

    నాణ్యమైన జీడిపప్పు ఒక అంగుళం పొడవు, కొంచెం మందంగా ఉంటుంది. ఇంతకంటే పెద్దగా లేదా చిన్నగా ఉంటే అది నాసిరకమైనది. అయితే చాలామంది అమ్మకం దారులు ఇది హైబ్రిడ్ జీడిపప్పు అంటూ విక్రయిస్తున్నారు. ఒక్కోసారి జీడిపప్పు మాడు వాసన అనిపిస్తుంది. నాణ్యమైన జీడిపప్పు సువాసన అందిస్తుంది. ఇదిఎలాంటి జిడ్డు వాసన కలిగి ఉండదు. జీడిపప్పు తింటున్నప్పుడు పళ్లకు అంటుకుంటే అది నకిలీదే. మాములుజీడిపప్పు పళ్ళలో నుంచి త్వరగా బయటికి రాదు. ఒకవేళ దంతాలు పట్టుకోకపోతే స్వచ్ఛమైనదికాదు.