Jeevitha Sathyalu: నిజం చెప్పాలి అంటే జీవితం లో ఒక స్టేజి కి వచ్చే వరుకు.. జీవితాన్ని మనం మన కోణంలో చూడలేం. దీనికితోడు వయసును బట్టి కూడా.. మనం చూసే కోణం మారుతూ ఉంటుంది. అందుకే, యుక్త వయసులో కొత్త కోణంలో జీవితాన్ని చూడడానికి ప్రయత్నించి చాలామంది భంగ పడుతూ ఉంటారు. అయితే, జీవితం అనేది వైట్ బుక్ లాంటిది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక్కో జీవితం ఒక్కో లెక్క లాంటిది. ఆ జీవితంలో ఎవడి ఫార్ములా వాడే కనిపెట్టుకోవాలి.

అందుకే, పక్కోడి జీవిత ఫార్ములాని మన జీవితానికి వాడుకోలేం. వాడుకుంటే.. కాపీ అవుతుంది. మనకంటూ ఓ గుర్తింపు రాదు. అందుకే.. పక్కవాళ్ళు చెప్పింది వినడం మానేయండి. ఏదన్నా సలహా కావాలంటేనే అడగండి. నచ్చిందే చేయండి, చేసేది నచ్చేలా చేయండి. చాలా సార్లు బొక్క బోర్లా పడొచ్చు. కానీ నేర్చుకోండి. జీవితంలో గెలిచిన వారి నుంచి కంటే కూడా ఓడిపోయినప్పుడే ఎక్కువ నేర్చుకోవచ్చు.
Also Read: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!
ఓ పెద్ద మనిషి చెప్పిన ఓ సినిమాలో డైలాగ్ గుర్తుకు వస్తుంది. మంచితనం అనేది మన చుట్టుపక్కల పరిస్థితులు మనకు అనుకూలించినంత వరకే మనలో ఉంటుంది అని .. పరిస్థితి చేయి దాటుతుంటే మనకు మన సర్వైవల్ మాత్రమే ముఖ్యం అనిపిస్తుంది. అయితే, ఎలాంటి పరిస్థితి వచ్చినా వ్యక్తిత్వం వదలని వాడే గొప్పవాడు. డబ్బు శాశ్వతం కాదు .. కాకపోతే ఈ మాట అనడానికి, ముందు డబ్బును జయించాలి.

మరో మాట మనిషి పై ఎప్పుడు ప్రభావం చూపిస్తోంది అంటూ అరిస్టాటిల్ ఒక మాట చెప్పేవారు. గొప్పవారు అనేవారు పుట్టరు, వారిని వారు గొప్పగా మలుచుకుంటారు అని. అవసరం అన్నీ నేర్పిస్తుంది. అందుకే గతంలో తగిలిన దెబ్బలను, అనుభవాలుగా చూడగలిగినప్పుడు పరిపక్వత సాధించినట్టు. కొంత మంది జీవితాల్లోకి ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు పోతారో తెలీదు. ప్రతి మనిషితో మనకు ఎంతో కొంత బంధం మిగిలి ఉంటుంది.
అందుకే, అందరికీ నువ్వు అన్ని వెళ్లాలా నచ్చవు. కాబట్టి, ఒక్కోసారి బ్యాడ్ అనిపించుకోవడంలో కూడా తప్పు లేదు ..ఏది రాదు, నా వాళ్ళు కాదు అనకు .. ప్రయత్నించు .. నువ్వు ఒక అడుగు ముందుకు వేయగలిగితే.. మూడు అడుగుల చోటు తెలియకుండానే ఏర్పడుతుంది. చివరకు అదే ఆత్మ సంతృప్తినిస్తుంది.
Also Read: కాపు నాయకులపై ఎన్నో అనుమానాలు?
[…] Lord Shiva: మన దేవతా మూర్తుల ఆకారాలు విచిత్రంగా ఉంటాయి. ఒకరు నాలుగు తలలతో ఉంటే మరొకరు శేష తల్పంపై శయనిస్తూ కనిపిస్తారు. మరొకరు మెడలో పామును వేసుకుని భక్తులను మెప్పిస్తారు. పౌరాణిక గాథల్లో కూడా వీరి రూపంపై పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా పూజించే దేవుళ్లలో శివుడే అందరికి ఇష్టం. శివుని కొలువని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి శివరూపంపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. […]