https://oktelugu.com/

Facial: స్పెర్మ్‌తో ఫేషియల్ హా.. సెలబ్రిటీల చర్మ సౌందర్య రహస్యం ఇదేనా!

సెలబ్రిటీలు ఎన్నేళ్లు అయిన కూడా అందంగా కనిపించడానికి ముఖ్య కారణం స్పెర్మ్ ఫేషియల్ అని అంటున్నారు. అసలు ఈ స్పెర్మ్ ఫేషియల్ అంటే ఏమిటి? సెలబ్రిటీల చర్మసౌందర్య రహస్యం ఇదేనా? దీనివల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2024 / 01:31 AM IST

    Facial Treatment

    Follow us on

    Facial: అందానికి అమ్మాయిలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చర్మానికి అందాన్నిచ్చే ఫుడ్స్‌ను చేర్చుకుంటారు. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారని భావిస్తారు. అందంగా ఉండాలంటే ఫుడ్ అనేది తప్పనిసరి. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇప్పుడున్న రోజుల్లో అందాన్ని పెంచుకోవడం కోసం ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఈ క్రమంలో బ్యూటీ పార్లర్‌కే ఎక్కువగా డబ్బు వెచ్చిస్తారు. రకరకాల ఫేషియల్స్ అంటూ డబ్బును ఖర్చు పెడుతుంటారు. అయితే సెలబ్రిటీలు ఎన్నేళ్లు అయిన కూడా అందంగా కనిపించడానికి ముఖ్య కారణం స్పెర్మ్ ఫేషియల్ అని అంటున్నారు. అసలు ఈ స్పెర్మ్ ఫేషియల్ అంటే ఏమిటి? సెలబ్రిటీల చర్మసౌందర్య రహస్యం ఇదేనా? దీనివల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీ మొత్తం చదివేయండి.

    స్పెర్మ్ ఫేషియల్‌ చేయడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా అందంగా కనిపిస్తారు. అయితే ఈ ఫేషియల్‌కి కావాల్సిన స్పెర్మ్‌ను సాల్మన్ ఫిష్‌ నుంచి తీస్తారు. పాలీన్యూక్లియోటైడ్ అనే ఒక ప్రొడక్ట్‌గా ఈ చేపల నుంచి తీసిన స్పెర్మ్‌తో తయారు చేస్తారు. సాల్మన్ స్పెర్మ్‌తో పాటు డీఎన్‌ఏ కూడా తీసుకుని ఇంజెక్ట్ తయారు చేస్తారు. ఈ ఇంజెక్షన్‌ను ముఖంపై వేసుకోవడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. సెలబ్రిటీలు ఈ ఫేషియల్ చేయించకోవడం వల్ల వారు ఎప్పటికీ యంగ్ లుక్‌లో కనిపిస్తారట. ఈ ఫేషియల్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో షేషన్ ధర దాదాపుగా రూ.5 వేలు నుంచి ప్రారంభమవుతుంది.

    మన ఇండియాలో అయితే స్పెర్మ్ ఫేషియల్ ధర ఎక్కువగా రూ.30 వేల వరకు ఉంది. ఈ ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం చాలా క్లియర్‌గా ఉంటుంది. సాల్మన్ ఫిష్‌లోని కొన్ని కణాలు చర్మంపై ఉండే యాంటీ ఏజింగ్‌ను క్లియర్ చేస్తాయి. దీంతో చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. సెలబ్రిటీలు ఎక్కువ ఖర్చు పెట్టి మరి ఈ ఫేషియల్ చేయించుకుంటారట. అందుకే వారికి వయస్సు పెరిగిన కూడా అందంగా కనిపిస్తారు. ఈ ఫేషియల్‌ను సెషన్స్ బట్టి చేసుకుంటారు. దాదాపుగా ఒక 5 సెషన్లు చేసుకోవడం వల్ల ముఖం అందంగా ఉంటుంది. ఫేస్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా చూడటానికి చాలా అందంగా ఉంటారట. కొందరు యంగ్ లుక్‌లో ఉండటానికి నెలకి ఒకసారి చేయించుకుంటారని అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.