https://oktelugu.com/

Eye Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పకుండా డైట్‌లో ఇవి చేర్చుకోవాల్సిందే!

కళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే మొబైల్ చూడటం తగ్గించడంతో పాటు ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చుకోవాలి. మరి ఆ పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2024 / 02:00 AM IST

    Eye Care

    Follow us on

    Eye Health: కళ్లు అనేవి ప్రతి ఒక్కరి ముఖ్యమే. కళ్లు ఉంటేనే అందమైన ప్రపంచాన్ని చూడగలం. అయితే నేటి కాలంలో చిన్న పిల్లలు, యువత కూడా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కేవలం వృద్ధులకు మాత్రమే అవసరమయ్యే అద్దాలు ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటున్నారు. ముసలితనంలో రావాల్సిన కళ్ల సమస్యలు ఇప్పుడు చిన్న వయస్సులోనే వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారంతో పాటు ఎక్కువగా మొబైల్, ల్యాప్ టాప్ వంటివి వాడటం వల్ల ఈ మధ్య కాలంలో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార విషయంలో అయితే తప్పకుండా కేర్ తీసుకోవాలి. అప్పుడే కళ్ల సమస్యల నుంచి విముక్తి చెందుతారు. ఈ రోజుల్లో గంటల తరబడి మొబైల్‌లో రీల్స్ చూడటం వల్ల ఆ బ్లూ రేస్ కళ్లకు హాని కలిగిస్తున్నాయి. దీనివల్ల తొందరగా కళ్ల సమస్యలు వస్తున్నాయి. కళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే మొబైల్ చూడటం తగ్గించడంతో పాటు ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చుకోవాలి. మరి ఆ పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    క్యారెట్లు
    కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా క్యారెట్లు తీసుకోవాలి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యారెట్లలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడ ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్లకు నష్టం కలగకుండా రక్షిస్తాయి. కొందరు పచ్చిగా లేదా జ్యూస్ చేసి తాగుతారు. ఇలా తినడం ఇష్టం లేకపోతే కూర చేసుకుని కూడా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లును ఎక్కువగా సలాడ్, సూప్‌లలో కూడా ఉపయోగిస్తారు.

    ఆకుకూరలు
    పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకు కూరలను డైలీ తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఆకుకూరల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో బాగా ఉపయోగపడతాయి. వీటిని కూర లేదా పప్పులో వేసుకుని వండుకుంటే కేవలం కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.

    పండ్లు
    కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో పండ్లు చేర్చుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి కంటి చూపును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష, సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటాయి. అలాగే క్యాప్సికం, టమాటో, స్ట్రాబెర్రీల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తప్పకుండా డైట్‌లో చేర్చుకోవడం వల్ల కంటి వ్యాధులు అన్ని దూరం అవుతాయి.

    సాల్మన్ ఫిష్
    సాల్మన్, ట్యూనా, సార్డిన్ చేపలు కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఎక్కువగా ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు కంటి మంటను తగ్గించి, కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చేపలను డైలీ తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

    గుడ్లు
    కోడి గుడ్లను ఉడికించి తినడం వల్ల కళ్ల దృష్టి పెరుగుతుంది. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్ వంటివి కూడా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.