https://oktelugu.com/

Exercise: సడెన్‌గా వ్యాయామం ఆపేస్తే.. బరువు ఎందుకు పెరుగుతారు?

కొందరు వాళ్ల బిజీ లైఫ్ వల్ల అసలు వ్యాయామం చేయడం లేదు. నిజం చెప్పాలంటే కనీసం శారీరక శ్రమ కూడా బాడీకి లేదు. దీంతో శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీంతో చివరకు బరువు తగ్గాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఫుడ్ విషయంలో డైట్ పాటించడం, వ్యాయామం చేయడం, జిమ్‌కు వెళ్లడం వంటివి చేస్తుంటారు. అయితే ఇది కేవలం మూన్నాళ్ల ముచ్చట మాత్రమే.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 18, 2024 / 02:35 AM IST

    weight gain

    Follow us on

    Exercise: వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. కొందరు వాళ్ల బిజీ లైఫ్ వల్ల అసలు వ్యాయామం చేయడం లేదు. నిజం చెప్పాలంటే కనీసం శారీరక శ్రమ కూడా బాడీకి లేదు. దీంతో శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీంతో చివరకు బరువు తగ్గాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఫుడ్ విషయంలో డైట్ పాటించడం, వ్యాయామం చేయడం, జిమ్‌కు వెళ్లడం వంటివి చేస్తుంటారు. అయితే ఇది కేవలం మూన్నాళ్ల ముచ్చట మాత్రమే. ఎందుకంటే ఒక రెండు నుంచి మూడు వారాలు వ్యాయామం చేస్తారు. మళ్లీ కాస్త బరువు తగ్గిన తర్వాత.. బద్దకం అయ్యి పూర్తిగా చేయడం మానేస్తారు. పోని వ్యాయామం చేయడం మానేసిన తర్వాత ఫుడ్ విషయంలో అయిన కేర్ పాటిస్తారా? అంటే అది కూడా చేయరు. దీంతో మళ్లీ బరువు పెరుగుతారు. అసలు వ్యాయామం ఆపేసిన తర్వాత బరువు ఎందుకు పెరుగుతారు? దీనికి గల కారణాలు ఏంటి? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    వ్యాయామం చేసేటప్పుడు తప్పకుండా అన్ని నియమాలు పాటిస్తారు. అదే ఒక్కసారి ఆపేస్తే.. ఏ విషయంలో కూడా నియమాలు పాటించరు. ముఖ్యంగా బాడీ అసలు అలసట చెందదు. దీంతో కేలరీలు బర్న్ కాకుండా అలాగే ఉండిపోతాయి. కాబట్టి బరువు ఇంకా పెరుగుతారు. మీరు డైలీ వ్యాయామం చేసి ఒక్కసారిగా ఆపేస్తే మళ్లీ వారంలోనే బరువు పెరుగుతారు. కేవలం వ్యాయామం అనే కాకుండా ఫుడ్ విషయంలో కూడా కేర్ చూపించరు. వ్యాయామం చేసేటప్పుడు డైట్ ఫాలో అవుతారు. దీంతో కొన్ని పదార్థాలు మాత్రమే తింటారు. కానీ ఒక్కసారిగా వ్యాయామం ఆపిన తర్వాత అన్ని రకాల పదార్థాలను తింటారు. దీంతో శరీరంలో కొవ్వు మళ్లీ పెరుగుతుంది. సడెన్‌గా వ్యాయామం ఆపడం వల్ల జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. దీంతో మీరు వెంటనే బరువు పెరుగుతారు. వ్యాయామం చేసేంత సమయం లేక ఆపేసిన తర్వాత కనీసం బాడీకి శారీరక శ్రమ పెట్టరు. రోజులో ఒక పది నిమిషాలు కూడా నడవరు. దీనివల్ల కండరాలు అన్ని కూడా నెమ్మదిస్తాయి. దీంతో తొందరగా బరువు పెరుగుతారు.

    బరువు పెరగకుండా తగ్గాలంటే వాటర్ ఎక్కువగా తాగాలి. అలాగే కేలరీల ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. కొందరు తక్కువగా నిద్రపోతారు. దీనివల్ల అమాంతం బరువు పెరుగుతారు. బాడీకి సరిపడా నిద్ర అనేది తప్పనిసరి. అయితే కేవలం ఈ కారణాల వల్ల మాత్రమే బరువు పెరగరు. థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలు ఉన్నా కూడా కొందరు ఒక్కసారిగా బరువు పెరుగుతారు. ఈ సమస్యలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే సమస్య పెరుగుతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.