https://oktelugu.com/

Exercise: నిద్రకు తక్కువ, వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

తిండి, నిద్రను పక్కన పెట్టి మరి వ్యాయామం చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. సరైన ఫుడ్, నిద్ర ఉండి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ నిద్రను పక్కన పెట్టి వ్యాయామం చేయడం వల్ల తప్పకుండా ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By: Kusuma Aggunna, Updated On : November 18, 2024 10:19 pm
Exercise

Exercise

Follow us on

Exercise: వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది వాళ్ల బిజీ లైఫ్ వల్ల అసలు వ్యాయామం చేయడం లేదు. నిజం చెప్పాలంటే కనీసం శారీరక శ్రమ కూడా బాడీకి లేదు. డైలీ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చెందుతారు. ఈ రోజుల్లో అందరూ కూడా సుఖానికి అలవాటు పడి కనీసం శారీరకంగా వ్యాయామం కూడా చేయడం లేదు. ఎక్కువగా కూర్చోని ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. మరి కొందరు వ్యాయామం అంటే ఇష్టంతో ఎక్కువగా చేస్తున్నారు. అంటే తిండి, నిద్రను పక్కన పెట్టి మరి వ్యాయామం చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. సరైన ఫుడ్, నిద్ర ఉండి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ నిద్రను పక్కన పెట్టి వ్యాయామం చేయడం వల్ల తప్పకుండా ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

రోజూ వ్యాయామానికి అలవాటు పడిన వారు రాత్రి ఎంత ఆలస్యంగా నిద్రపోయిన కూడా ఉదయం లేచి వ్యాయామం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి రోజుకి తప్పకుండా 8 గంటల నిద్ర అనేది అవసరం. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే శారీరకంతో పాటు మానసిక సమస్యల బారిన కూడా పడతారు. కొందరు ఒత్తిడితో ఉన్నప్పుడు కూడా వ్యాయామం చేయకూడదని నిపుణులు అంటున్నారు. శరీరానికి వ్యాయామం మంచిదే. కానీ పూర్తిగా నిద్ర లేనప్పుడు చేయడం వల్ల బాడీ నీరసంగా మారుతుంది. నిద్ర అనేది ప్రతీ ఒక్కరికి ముఖ్యమే. నిద్ర వల్ల మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే బాడీకి సరిపడా నిద్రపోవడం వల్ల ఉదయం లేచిన తర్వాత ఎలాంటి నీరసం, అలసట అనిపించవు. లేకపోతే ఏం పనిచేసిన నీరసంగా అనిపిస్తుంది. దేని మీద కూడా సరిగ్గా ధ్యాస పెట్టలేరు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా నిద్ర అనేది ఉండాల్సిందే.

 

ఆరోగ్యంగా జీవించాలంటే నిద్రతో పాటు వ్యాయామం కూడా లైఫ్‌లో చేయాల్సిందే. అయితే ఈ వ్యాయామాన్ని ఎలా చేస్తున్నామనే విషయాన్ని గుర్తించుకోవాలి. పోషకాలు ఉండే ఫుడ్ సరిగ్గా తీసుకుంటూ.. నిద్ర అన్ని విషయాలు చూసుకుని చేయడం వల్ల శరీరానికి ప్రయోజనాలు లభిస్తాయి. లేకపోతే లేని పోని సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. నిద్ర తక్కువ కావడంతో కూడా వ్యాయామం చేస్తే మెదడులోని కణాలు నశించిపోతాయి. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా రాత్రి నిద్రలేకపోతే ఉదయాన్నే వ్యాయామం చేయడం ఆరోగ్యానికి అంతమంచిది కాదు. మీ బాడీకి సరిపోయే వరకు నిద్రపోయిన తర్వాతే వ్యాయామం చేయడం మంచిది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.