https://oktelugu.com/

Erithriaya Marriages : అక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైళ్లో పెడుతారు..

అయితే ఈ సంప్రదాయం ఏర్పడడానికి ఓ కారణం ఉంది. సాధారణంగా భారత్ లో ఆడపిల్లల కరువు ఎక్కువగా ఉంది. కానీ ఎరిత్రియా దేశంలో మగవాళ్లు చాలా తక్కువగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2024 / 10:20 AM IST

    Erithriya Marriages

    Follow us on

    Erithriaya Marriages :పెళ్లి అనేది ప్రతి వ్యక్తికి అతి ముఖ్యమైన ఘట్టం. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండే ఈ తంతును వివిధ రకాలుగా నిర్వహించుకుంటున్నారు. భారతీయ వివాహ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకే భార్యను కలిగి ఉండాలి. రెండో వివాహం చేసుకుంటే చట్టబద్ధంగా విడిపోవాలి. అలా కాకుండా ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం కుదరదు. కానీ ఓ దేశంలో మాత్రం ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికి నిరాకరరిస్తే ఏకంగా జైళ్లో పెడుతారు. అయితే ఇలా చేయడానికి పెద్ద కారణమే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

    పెళ్లంటే నూరేళ్ల పంట అని భావిస్తారు. ఈ కార్యక్రమాన్ని కొందరు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. మరికొందరు దండలు మార్చుకుంటారు. పెళ్లి ఎలా చేసుకున్నా జీవితాంతం ఆ వ్యక్తితో కలిసి ఉండాలనే నిబంధన ఉంది. అయితే కాలం మారుతున్న కొద్ది దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లయిన కొద్దికాలానికే విడిపోతున్నారు. కానీ కొంత మంది మాత్రం సాంప్రదాయాలకు కట్టుబడి జీవిత భాగస్వామితోనే కలిసి ఉంటారు. ఎవరెలా ఉన్నా మనదేశంలో మాత్రం ఒక వ్యక్తి ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి.

    కానీ ఆఫ్రికా ఖండంలోని ఓదేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా సాంప్రదాయం ఉంది. ఒక వ్యక్తి కచ్చితంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలట. ఈ ఖండంలోని ఎరిత్రియా దేశంలో ప్రతీ పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. చట్టం ప్రకారం చేసుకున్న ఈ పెళ్లి కి మహిళలు కూడా అంగీకరించాలి. కాదని ఎవరు అడ్డు చెప్పినా వారిని జైళ్లో పెడుతారు. ఇద్దరు భార్యలను పోషిస్తూ వారితో కలిసి జీవించాలి.

    అయితే ఈ సంప్రదాయం ఏర్పడడానికి ఓ కారణం ఉంది. సాధారణంగా భారత్ లో ఆడపిల్లల కరువు ఎక్కువగా ఉంది. కానీ ఎరిత్రియా దేశంలో మగవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. దీంతో పెళ్లి చేసుకోవాడానికి పురుషులు దొరకకపోవడంతో ఇలాంటి సాంప్రదాయం పెట్టారు. దీంతో స్త్రీ, పురుష నిష్పత్తి సమానంగా ఉంటుందని అక్కడి ప్రభుత్వం భావించి ఇలాంటి నిబంధనలు పెట్టింది. అంతేకాకుండా ఎవరైనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటే వారిని దోషిగా పరిగణిస్తారు. అయితే కొందరు మాత్రం ఈ దేశంలో అలాంటి నిబంధనలు ఏవీ లేవని కొట్టి పారేస్తున్నారు.