Dinesh Karthik- Ravichandran Ashwin: డెత్ ఓవర్లలో హార్డ్ ఫినిషర్ గా పేరొందిన దినేష్ కార్తీక్ టి20 కెరీర్ ఇక ముగిసినట్టే. బంతిని గింగిరాలు తిప్పడంలో సిద్ధ హస్తు డైన రవిచంద్రన్ అశ్విన్ టి20 క్రికెట్ మ్యాచ్ ల్లో కనిపించకపోవచ్చు. వారికి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 మెన్స్ వరల్డ్ కప్ చివరిది కావచ్చు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్ తో ఆడే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టును చూస్తే టీ 20 ప్రపంచ కప్ (2024, వెస్టిండీస్, అమెరికా) కు వచ్చే తరాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ కప్ లో 37 ఏళ్ల వయసు ఉన్న దినేష్ కార్తీక్ ను కివిస్ తో జరిగే టి20 మ్యాచ్ లకు విస్తరించారు. అలాగే 36 సంవత్సరాల అశ్విన్ కూడా ఎంపిక చేయలేదు.

వారి రాక వెనుక అతడు
వాస్తవానికి ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్ ఈ ఎంపిక అవుతారని ఎవరూ ఊహించలేదు. కానీ కెప్టెన్ రోహిత్ అండతో నాలుగేళ్ల విరామం తర్వాత అశ్విన్ రవిచంద్రన్ టి 20 లో పునరాగమనం చేశాడు.. ఇక దినేష్ కార్తీక్ కూడా రోహిత్ శర్మ అండతో పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు.. ఈ ప్రపంచ కప్ తర్వాత వీరిద్దరూ దేశం తరఫున పొట్టి క్రికెట్ ఆడితే ఆశ్చర్య పోవాల్సిందేనని మార్చి క్రికెట్ క్రీడాకారులు అంటున్నారు. న్యూజిలాండ్ తో జట్టు కూర్పు తర్వాత చేతన్ శర్మ విలేకరులతో మాట్లాడాడు. ఎవరికి విశ్రాంతి ఇవ్వాలో, ఇవ్వకూడదో మేము నిర్ణయించాలి. కార్తీక్ మాకు అందుబాటులోనే ఉన్నాడు. కానీ ప్రపంచ కప్ తర్వాత ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నామని బేతం శర్మ స్పష్టం చేశాడు. ఎక్కువసేపు క్రీజ్ లో ఉండని దినేష్ కార్తీక్ కు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో చేతన్ శర్మ స్పష్టం చేయలేదు. ఇక అతన్ని పక్కనపెట్టి భవిష్యత్తు తరాన్ని ప్రోత్సహించాలని సెలెక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్, సంజూ సాంశన్, హార్దిక్ పాండ్య లను హార్ట్ హిట్టర్లు గా తయారు చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

బంగ్లాదేశ్ తో ఆడేది అనుమానమే
టి20 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ వెన్ను నొప్పితో మైదానాన్ని వీడాడు. అయితే బుధవారం బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్లో అతడు ఆడేది అనుమానమే. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 16వ ఓవర్లో వెన్ను నొప్పితో కార్తీక్ ఫెవిలియన్ చేరడంతో అతడి స్థానంలో పంత్ కీపింగ్ చేశాడు.. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ కు అతడు దూరమైతే అతడి బదులు పంత్ ఆడతాడు. ఆస్ట్రేలియాలో తీవ్రమైన చలి ఉన్నందువల్లే కార్తిక్ ఎందుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపారు. అయితే ఈ టోర్నీలో బ్యాటింగ్ చేసిన రెండు మ్యాచ్ల్లోనూ కార్తీక్ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.