Work From Home: భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు …వర్క్ ఫ్రం హోమే సో బెటర్…

ప్రస్తుతం యువర్స్ లోని 80 శాతం మంది ఉన్నతాధికారులు మొదట్లో వాళ్ళు తీసుకున్నటువంటి రిటర్న్ టు ఆఫీస్ నిర్ణయం పై ప్రస్తుతం విచారం వ్యక్తం చేస్తున్నారట. ఉద్యోగులు ఏది ఆశిస్తున్నారు అన్న విషయం ముందుగానే అవగాహన ఉండి ఉంటే వారి ప్రణాళికలు ఎంతో భిన్నంగా ఉండేవని.

Written By: Vadde, Updated On : August 15, 2023 2:12 pm

Work From Home

Follow us on

Work From Home: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే గత కొద్దిరోజులుగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు అన్న ఇంప్రెషన్ ఎక్కువ అయిపోయింది. అయితే ప్రస్తుతం గ్లోబల్ కంపెనీలు కూడా ఇంటి వద్ద నుంచి చేసుకుని వసతికి స్వస్తి చెప్పి ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా కొత్త నియమ నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నారు. కానీ యూఎస్ఏ లో మాత్రం రీసెంట్గా నిర్వహించిన అధ్యయనం ప్రకారం వర్క్ హోం బెటర్ అన్న మాట స్పష్టం అవుతుంది.

ప్రస్తుతం యువర్స్ లోని 80 శాతం మంది ఉన్నతాధికారులు మొదట్లో వాళ్ళు తీసుకున్నటువంటి రిటర్న్ టు ఆఫీస్ నిర్ణయం పై ప్రస్తుతం విచారం వ్యక్తం చేస్తున్నారట. ఉద్యోగులు ఏది ఆశిస్తున్నారు అన్న విషయం ముందుగానే అవగాహన ఉండి ఉంటే వారి ప్రణాళికలు ఎంతో భిన్నంగా ఉండేవని.. వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు రూపొందించే ఉండేవాళ్ళం అని ఇప్పుడు బాధపడుతున్నారు.

గత కొద్దికాలంగా నెలకొన్నటువంటి పరిణామాల దృశ్య యుఎస్ లో ఒక వెయ్యి మందికి పైగా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, వర్క్ ప్లేస్ మేనేజర్లను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్లు చెప్పినటువంటి విషయాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైనప్పటి నుంచి ఆఫీసుపై ఉద్యోగస్తుల భారం చాలా వరకు తగ్గింది. మెయింటెనెన్స్ ఖర్చుల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ వరకు ఎంతో కంపెనీకి సేవ్ అవుతుంది.

కానీ ఇప్పుడు ఉద్యోగులను తిరిగి ఆఫీస్ కి పిలవడం వల్ల వాళ్లు ప్రెజర్ ఫీల్ అవ్వడమే కాకుండా కంపెనీ ఫైనాన్స్ మీద కూడా ప్రెషర్ పడేట్టుగా ఉంది. కొంతమంది ఉన్నతాధికారులు ఇన్-ఆఫీస్ పాలసీలను ఎలా అంచనా వేయాలి అని సతమతమవుతున్నారు. ఆఫీస్ స్పేస్, ఉద్యోగులకు అందించవలసిన బేసిక్ ఫెసిలిటీస్, రియల్ ఎస్టేట్ పెట్టుబడి…ఇలా అంచనా వేస్తూ పోతే ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేటప్పుడు తో పోల్చుకుంటే ఆఫీస్ కి రెగ్యులర్గా వస్తే అయ్యే ఖర్చు జాస్తి అని తేలింది.

అలాగే కంపెనీలో జరిగే వర్క్ అనాలసిస్ ప్రకారం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు అవుట్ ఫుట్ ఎక్కువగా వస్తోంది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఒక్క న్యూయార్క్ నగరంలోని సగటున ఒక ఉద్యోగికి సంవత్సరానికి $16,000 ఆఫీస్ స్పేస్ ఖర్చవుతుంది . ప్రస్తుతం రిటర్న్ టు ఆఫీస్ విధానాలను కఠినంగా అవలంబించాలి అనుకుంటున్న కంపెనీలు మంచి స్టాప్ ని కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు తీసుకుంటున్న విధానాలపై పునః పరిశీలించుకోవాల్సిన అవసరం ఉత్పన్నమవుతోంది. కచ్చితంగా ఆఫీస్ కి వచ్చే పని చేయాలి అని మొరాయించే కంపెనీలు తమ టర్నోవర్ విషయంలో సమస్యలు కూడా ఎదుర్కునే అవకాశం ఉంది అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

.