Electric Vehicles: భవిష్యత్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ దే..వేగంగా మార్పులు.. 2030 నాటికి ఎంతలా మారిపోతుందంటే?

పర్యావరణ మార్పులతో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. జనాభా పెరగడంతో వాహనాల వినియోగం కూడా పెరిగాయి. దీంతో వాటి నుంచి వెలువడే కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటోందని వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరించింది.

Written By: Chai Muchhata, Updated On : July 29, 2023 8:52 am

Electric Vehicles

Follow us on

Electric Vehicles: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈయూ)వైపు చూస్తున్నారు. స్కూటర్ నుంచి బస్సుల వరకు ఈయూ లను తయారుచేసిన మార్కెట్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సైతం టార్గెట్ విధించింది. ఇందులో భాగంగా ముందుగా ఆర్టీసీల్లో విద్యుత్ బస్సుల ప్రవేశాన్ని వేగవంతం చేసింది. తాజాగా బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) లో మోడల్ విద్యుత్ బస్సును ప్రవేశపెట్టారు. అత్యాధునిక సదుపాయాలతో పాటు విద్యుత్ తో నడిచే ఈ బస్సు నమూనాను శుక్రవారం బీఎంటీసీ ప్రవేశపెట్టింది. ఇది సక్సెస్ కావడంతో వెంటనే 921 బస్సుల ఆర్డర్లను ఇచ్చింది. 2030 నాటికి భారత్ లో 5 కోట్ల విద్యుత్ వాహనాలను తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తోంది.

ర్యావరణ మార్పులతో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. జనాభా పెరగడంతో వాహనాల వినియోగం కూడా పెరిగాయి. దీంతో వాటి నుంచి వెలువడే కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటోందని వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరించింది. మరోవైపు వాహనాల్లో వినియోగించే పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయంగానూ చమురుకు కొరత ఏర్పడడంతో రానున్న రోజుల్లో ఇది తీవ్రంగా కొరతగా ఏర్పడే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని చూస్తోంది.

ఇప్పటికే విద్యుత్ స్కూటర్లు, కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి. కొన్ని స్కూటర్లు మినహా మిగతా వెహికిల్స్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.దీంతో విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచాలని సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బెంగుళూరులోని మెట్రో పాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ తమ సంస్థకు 921 బస్సులు అవరసం ఉందని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టీఎంఎల్ స్మార్ట్ సిటీ మొబైలిటీ సొల్యూషన్ కు ఆర్డర్లు ఇచ్చింది. ఈ సంస్థ బస్సులను తయారు చేసి ఇవ్వడమే కాకుండా 12 ఏళ్లపాటు నిర్వహణ, మరమ్మతులు చేయిస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి మరినని సేవలను అందిస్తుంది.

విదేశాల్లో ఇప్పటికే చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగిపోయాయి. ఈ విషయంలో అమెరికా, చైనా ముందున్నాయి. అయితే భారత్ లో 2022 నాటికే 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు దాటాయిన ఓ అంచనా. 2030 నాటికి వీటి సంఖ్య 5 కోట్ల వరకు చేయాలన్నదే టార్గెట్. ప్రస్తుతం ఈ వెహికిల్స్ కు 1700 పబ్లిక్ చార్జింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవి సరిపోవని, వీటి సంఖ్య పెంచాలని వినియోగదారులు కోరుతున్నారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు సైతం విద్యుత్ వాహనాలపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టార్గెట్ రీచ్ కు ఏమాత్రంపెద్ద కష్టం కాదని ప్రభుత్వం భావిస్తోంది.