Kia Sonet: మారుతి బ్రెజా కు గట్టి పోటీ ఇస్తున్న కారు ఇదే.. ధర కూడా తక్కువే..

ఎలక్ట్రిక్ సన్ రూఫ్ లో మారుతి మొదటిసారిగా ‘బ్రజ్జా’ను తీసుకొచ్చింది. దీనిని 2022లో ఆవిష్కరించింది. ఇందులో కొత్త ఇన్ స్ట్రుుమెంట్ క్లస్టర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Written By: Srinivas, Updated On : September 7, 2023 10:03 am

Kia Sonet

Follow us on

Kia Sonet: దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు మార్కెట్లోకి రిలీజై వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మారుతి నుంచి వచ్చిన వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ అమ్మకాల్లో వృద్ధి సాధించాయి. ఈ తరుణంలో బ్రెజ్జా కూడా ఆకట్టుకుంటుంది. అయితే మార్కెట్లో ఏర్పడిన పోటీ కారణంగా మరో కంపెనీ ఇదే మోడల్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో బ్రెజ్జా కోరుకునేవారు ఇప్పుడు ఆ కారుపై మనసు మార్చుకుంటున్నారు. ఫీచర్లతో పాటు సరసమైన ధరను కలిగి ఉండడంతో ఆ కారు అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ఇంతకీ ఆ కారు గురించి తెలుసుకుందామా..

దక్షిణ కొరియాకు చెందిన Kia భారత ఆటోమొబైల్ మార్కెట్ ను మెల్లగా షేక్ చేయడానికి ట్రై చేస్తోంది. కంపెనీ నుంచి కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. లేటెస్టుగా ఈ కంపెనీ Sonet Electric Sunroof ను తీసుకొచ్చింది. ఎస్ యూవీ వినియోగదారుల కోసం కియా ఇప్పటికే Sonet ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీనిని అప్ గ్రేడ్ చేస్తూ Sonet Electric Sunroof ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇది Sonet Smartstream G1.2 HTK+ అనే వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఎలక్ట్రిక్ సన్ రూఫ్ లో మారుతి మొదటిసారిగా ‘బ్రజ్జా’ను తీసుకొచ్చింది. దీనిని 2022లో ఆవిష్కరించింది. ఇందులో కొత్త ఇన్ స్ట్రుుమెంట్ క్లస్టర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ వినియోగదారులను ఆకర్షించాయి. ఈ పీచర్లు గ్లోబల్ ఎన్ పిఎపి సేఫ్టీ రేటింగ్ ను అందిస్తాయి. దీనిని సుజుకి హార్ట్ టెక్ట్ ఫ్లాట్ ఫారమ్ పై నిర్మించింది. ఇందులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఈ మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 103 బీహెచ్ పీ గరిష్ట శక్తిని అలాగే 137 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.10.96 లక్షలతో విక్రయిస్తున్నారు.

అయితే దీనిని బీట్ చేస్తూ కియా సోనెట్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ మార్కెట్లో ఆకర్షిస్తోంది.కియా సోనెట్ ఎలక్ట్రికల్ సన్ రూప్ 1.2 లీటర్, 4 సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 83 పీఎస్, 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే తో కూడిన 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, 4 స్పీకర్, ఆటోమేటిక్ ఏసీ, ఆటోమేటిక్ హెడ్ ల్యాప్ లు ఉన్నాయి.

కియా సోనేట్ సన్ రూఫ్ ధర రూ.9.76 లక్షలు. ఇక ఈ మోడల్ ఇప్పటి వరకు అత్యధికంగా 3.3 లక్షలకు పైగా విక్రయించింది. కొత్తగా కారు కొనాలనుకునేవారు బ్రెజ్జాను చూసి ఆ తరువాత కియా సోనెట్ సన్ రూఫ్ పై మనసుపెడుతున్నారు. అయితే బ్రెజ్జాలో లేని సబ్ -4 మీటర్ ఎస్ యూవీ సెగ్మెంట్ లోని కియాలో మాత్రమే కనిపిస్తాయి. ఇలా ధర తక్కువగా ఉండడతో పాటు అప్డేట్ ఫీచర్లు ఉండడంతో మారుతి బ్రెజ్జాకీ కియా సోనెట్ సన్ రూఫ్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు.