EIL Recruitment 2022: ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 75 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. బీఈ లేదా బీటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: సంగీత ప్రపంచంలో డిస్కో గోల్డ్ మాన్
2022 గేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారని గుర్తుంచుకోవాలి. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. గేట్ – 2022 మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 22వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా వచ్చే నెల మార్చి 14వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.
https://engineersindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. గేట్ 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకోని వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అనర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: వరుణ్ తేజ్ ‘గని’ రన్ టైం ఎంతంటే?
నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. బీటెక్ చదువుతున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read:
1. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
2. తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
3. నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు
4. సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించాడా? ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో వాళ్లు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?