https://oktelugu.com/

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మరణమే ?WHO తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలివీ

అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రతీ సంవత్సరం 18.9 లక్షల మంది మరణిస్తున్నట్లు డబ్ల్యూ హెచ్ వో తెలిపింది. ప్రస్తుతం టేస్ట్ కోసం ఎక్కువగా ఉప్పును వినియోగిస్తున్నారట. అంతేకాకుండా ఫ్రైడ్ ఫుడ్, జింక్ ఫుడ్ లల్లో ఉప్పు మలినంగా మారి శరీరానికి హాని కలిగిస్తుందని తెలిపారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 17, 2024 2:23 pm
    Follow us on

    ఉప్పు షడ్రుచులలో ఒకటి. మనుషులు ఎలాంటి ఆహారం తీసుకున్నా.. అందులో లవణం లేకపోతే రుచి ఉండదు. ఉప్పు రుచిని మాత్రమే కాకుండా శరీరాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. కండరాల సంకోచం, నరాల పనితీరులో ఉపయోగపడుతుంది. ఆహారంలో ఉప్పు అవసరమైనంత వాడితేనే ఆరోగ్యంగా ఉంటారు. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పును తక్కువగా తీసుకుంటే నీరసంగా ఉంటుంది. అయితే ఎక్కువగా తీసుకున్నా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఆహార పదార్థాల్లో రుచికోసం ఉప్పు వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రతీ ఏడాది 18.9 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని World Health Organisatio(WHO) తెలిపింది. అయితే ఎంత మోతాదులో ఉప్పు తీసుకోవాలి?

    ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినేవారికి గుండె జబ్బులు త్వరగా వస్తాయి. అధిక రక్త పోటు నుంచి మూత్రపిండాల వ్యాధి, ఎముకల నష్టం, అధిక దాహం వంటి సమస్యలు వస్తాయి. ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. దీంతో బీపీ ఎక్కువై గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి గుండు ప్రమాదం తీవ్రమై చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో మూత్ర పిండాలపై కూడా ప్రభావం ఉంటుంది.

    అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రతీ సంవత్సరం 18.9 లక్షల మంది మరణిస్తున్నట్లు డబ్ల్యూ హెచ్ వో తెలిపింది. ప్రస్తుతం టేస్ట్ కోసం ఎక్కువగా ఉప్పును వినియోగిస్తున్నారట. అంతేకాకుండా ఫ్రైడ్ ఫుడ్, జింక్ ఫుడ్ లల్లో ఉప్పు మలినంగా మారి శరీరానికి హాని కలిగిస్తుందని తెలిపారు. ప్రాసెస్ చేసిన ఆహారంలో ఎక్కువగా ఉప్పు వినియోగమై శరీరానికి హానిని కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా కూరల్లో ఉప్పు తక్కువైనప్పుడు పచ్చి ఉప్పువేయడం ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.

    అందువల్ల ఉప్పు వినియోగం తగ్గించాలని అంటున్నారు. ప్రతిరోజూ 10.78 గ్రాములు వాడుతున్నారట. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతిరోజూ 5 గ్రాముల ఉప్పును మాత్రమే వినియోగించాలని చెబుతున్నారు. ఉప్పు మోతాదుకు మించకుండా జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ఒకవేళ ఉప్పు ఎక్కువగా తీసుకున్నా..లవణ శాతం తగ్గించేపదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు.