https://oktelugu.com/

Almonds : బాదంను ఇలా తింటే డేంజర్

ప్రతిరోజూ రాత్రి బాదం గింజలు నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందువల్ల పొట్టు తీసేసిన బాదం తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2024 / 10:10 AM IST
    Follow us on

    Almonds : ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం భోజనం మాత్రమే శరీరానికి శక్తిని ఇవ్వదు. డ్రూఫ్రూట్స్ లాంటి వాటిల్లోపోషకాలు అదనంగా ఉంటాయి. అందువల్ల వీటిని క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల అదనపు శక్తి లభించి ఆరోగ్యంగా ఉంటారు. డ్రై ఫ్రూట్స్ లో బాదం నెంబర్ వన్ గా నిలుస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని ఏదో రకంగా తీసుకోవాలని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు బాదంను పొట్టుతో కలిపి తినాలని అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం పై దానిని తీసేసి తినాలంటున్నారు. ఈనేపథ్యంలో బాదంను పొట్టుతో తినడం వల్ల ఏం జరుగుతుంది?

    100 గ్రాముల బాదం గింజల్లో 10.8 గ్రాముల ఫైబర్, 5.11 గ్రాముల కొవ్వు తో పాటు రాగి, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాదంను వివిధ పదార్థాల్లో వాడడం వల్ల రుచిగా ఉంటుంది. అయితే దీనిని నేరుగా తీసుకోవచ్చు. ప్రతి రోజూ 5 నుంచి 10 గింజల బాదం పప్పులు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

    అయితే బాదం ను చాలా మంది పొట్టుతోనే తినాలని చెబుతారు. కానీ ఇలా తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. జీర్ణక్రియ మందగించి అవస్థలు ఏర్పడుతాయి. అందువల్ల దీనిని పొట్టుతో కాకుండా అది తీసేసి తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రతిరోజూ రాత్రి బాదం గింజలు నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందువల్ల పొట్టు తీసేసిన బాదం తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.