Eating: భోజనం చేసిన తరువాత పడకగదిలోకి వెళ్లున్నారా? ఒక్క క్షణం ఆగండి..

భోజనం చేసిన తరువాత చాలా మంది ఓ కునుకు తీయాలని అనుకుంటారు. వాస్తవానికి కడుపు నిండిన తరువాత కొంత మందికి నిద్ర వస్తుంది. దీంతో చేతులు కడిగిన వెంటనే పడక గదిలోకి వెళ్లి నిద్రిస్తారు.

Written By: Chai Muchhata, Updated On : October 3, 2023 4:27 pm

Eating

Follow us on

Eating: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపైన శ్రద్ధ వహించడం లేదు. చాలా మంది పౌష్టికాహారం తీసుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ ప్రణాళిక లేకుండా ఆహారం తీసుకోవడం కూడా ఆరోగ్య సమస్యలు తెస్తుందని కొందరు ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన తరువాత చాలా మంది చేయకూడని పనులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తిన్నఆహారం సరైన విధంగా జీర్ణం కాక కొత్త కొత్త రోగాలు వస్తాయి. అందువల్ల ఆహారం తిన్న తరువాత కొన్నివిషయాలు తప్పక పాటించాలి. అవేంటంటే?

భోజనం చేసిన తరువాత చాలా మంది ఓ కునుకు తీయాలని అనుకుంటారు. వాస్తవానికి కడుపు నిండిన తరువాత కొంత మందికి నిద్ర వస్తుంది. దీంతో చేతులు కడిగిన వెంటనే పడక గదిలోకి వెళ్లి నిద్రిస్తారు. నిద్రపోయే సమయంలో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. అప్పటి వరకు తిన్న ఆహారం అలాగే ఉండిపోయి కొవ్వులా పేరుకుపోతుంది. దీంతో ఆ మరుసటి భోజనం చేసేటప్పుడు వికారం లాంటివి వస్తాయి. అందువల్ల తిన్న వెంటనే నిద్రపోకుండా కాస్తా అటూ ఇటూ తిరగాలి.

కార్యాలయాల్లో పనిచేసేవారు భోజనం చేసిన తరువాత టీ తాగుతారు. ఇలా చేయడం వల్ల డైజేషన్ అవుతుందని అనుకుంటారు. కానీ టీలో ఉండే కెపిన్ ఆహారాన్ని జీర్ణం కానివ్వదు. పైగా అసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కనీసం గంట సమయం తరువాత టీ తీసుకోవచ్చు.

భోజనం చేసిన తరువాత స్మోకింగ్ చేస్తుంటారు. కానీ ఇది గ్యాస్ సమస్యలు తెస్తుంది. అలాగే ఇవి రక్తంలో చక్కెర నిల్వలు పెరిగేందుకు సహకరిస్తాయి. దీంతో భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఆహారం తిన్న తరువాత వర్కౌట్లు చేస్తుంటారు కొందరు. ఇలా చేయడం వల్ల ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడమే కాకుండా పేగుల్లో కదలిక ఏర్పడి కడుపు నొప్పి వస్తుంది. ఫలితంగా చాలా అవస్థలు పడాల్సి వస్తుంది.

ఇక చాలా మంది భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా నీరు తాగడం వల్ల కడుపులో రిలీజ్ అయ్యే అమ్లం పలచబడుతుంది. దీంతో ఆహారం జీర్ణం కాకుండా అలాగే ఉండిపోతుంది.