Jobs: ఈస్ట్రన్ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 2972 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుండగా 2022 సంవత్సరం మే నెల 10వ తేదీ ఈ ఉద్యోగ ఖళీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో హౌరా డివిజన్ లో 659 పోస్టులు ఉండగా లిలుహ్ డివిజన్ లో 612 పోస్టులు ఉన్నాయి.
సీల్దా డివిజన్, కంచరపర డివిజన్, జమాల్‌పూర్ డివిజన్ , అసన్సోల్ డివిజన్, మాల్డా డివిజన్ లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. రైల్వే సంస్థ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా సులభంగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. పదో తరగతి పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జాతీయ ted సర్టిఫికెట్ కూడా ఉండాలి. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీస్థాయిలో బెనిఫిట్ కలగనుంది. రైల్వే శాఖ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.