Ear Problem : ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.. లేకపోతే చెవుడు వస్తుంది..

విలో ఉన్న వ్యాక్స్ ను తీసే క్రమంలో దూది లాంటి బడ్స్ ను చెవిలో పెట్టినప్పుడు అవి మరింత ముందుకు వెళ్తాయి. ఇలా ముందుకు వెళ్లి చెవి డ్రమ్ కు అడ్డుగా ఉంటాయి.

Written By: Chai Muchhata, Updated On : February 13, 2024 12:59 pm

ear problem

Follow us on

Ear Problem :కాలం మారుతున్న కొద్దీ మనుషుల అలవాట్లు మారుతున్నాయి. దీంతో కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన వారు నిర్లక్ష్యంగా ఉంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మానవ శరీరంలోని ప్రధాన అవయవాల్లో చెవులు కూడా ఉన్నాయి. వినికిడి లేకపోతే ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నాడో అర్థం కాదు. దీంతో జీవన మనుగడ కష్టంగా మారుతుంది. వయసు పెరిగే కొద్దీ చెవి బాగాలు దెబ్బతిని వినికిడి సమస్య ఏర్పడుతుంది. కానీ కొందరికి ఉన్న ఈ అలవాటు ద్వారా చిన్న వయసులోనే చెవి సమస్యలను తెచ్చుకుంటున్నారు. అందువల్ల ముందుగా ఈ అలవాటు మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదేంటంటే?

తల భాగంలో ఉండ కళ్లు, నోరు, ముక్కుతో పాటు చెవులు కూడా ఇంపార్టెంటే. చెవి లోపన ఉన్న కర్ణబేరి వినికిడిని పసిగడుతుంది. ఇది ఆరోగ్యంగా ఉంటనే చిన్న శబ్దమైనా వినిపిస్తుంది. చెవిలో ఉండే వ్యాక్స్ ఒక రకమైన ఆసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బయటకు వచ్చినప్పుడు బయటి నుంచి వచ్చే దుమ్మ దూళిని ఆపతుంది. అయితే ఒక్కోసారి డస్ట్ మొత్తం ఈ ఆసిడ్ పై పేరుకుపోయి గడ్డ లాగా మారుతుంది.

ear buds

దీనిని శుభ్రం చేసుకోవడానికి ఒకప్పుడు ఇనుముకు సంబంధించిన పరికరాలు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇయర్ బడ్స్ ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చెవిలో ఉన్న వ్యాక్స్ ను తీసే క్రమంలో దూది లాంటి బడ్స్ ను చెవిలో పెట్టినప్పుడు అవి మరింత ముందుకు వెళ్తాయి. ఇలా ముందుకు వెళ్లి చెవి డ్రమ్ కు అడ్డుగా ఉంటాయి. ఒక్కోసారి ఇయర్ బడ్స్ లోపలికి నెట్టడం వల్ల ఇయర్ డ్రమ్ పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది.

అందువల్ల వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రతగా వహించాలి. దాదాపు వీటిని ఉపయోగించకుండా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాటన్ లాంటి ఈ బడ్స్ ను చెవిలో పెట్టడం వల్ల చెవిలో కాటన్ పడిపోయే అవకాశం ఉంది. ఇలా కూడా డస్ట్ చేసి చెవిని ఇబ్బంది పెడుతాయి. అందువల్ల ఇయర్ బడ్స్ ఉపయోగించకుండా ఉండడమే మంచిది.