Dust Allergy: దుమ్ము వల్ల అలెర్జీ వస్తుందా? దీని నుంచి విముక్తి చెందడం ఎలా?

దుమ్ము, దూళి, కాలుష్యం వల్ల కొందరికి అలెర్జీ, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. చాలా మంది కూడా ఈ దుమ్ము వల్ల ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్య నుంచి విముక్తి చెందడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 28, 2024 10:25 pm

Dust allergy

Follow us on

Dust Allergy: వాతావరణంలో మార్పులు, మనుషులు జీవనశైలి వల్ల దుమ్ము, కాలుష్యం రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా పట్టణాల్లో అయితే చెప్పక్కర్లేదు. పీల్చే గాలిలో అసలు నాణ్యత కూడా ఉండదు. జీవనశైలి బాగా మారిపోయింది. తినే ఫుడ్‌తో పాటు మనం పీల్చే గాలి కూడా ఆఖరికి కల్తీ అయిపోయింది. వాతావరణం కాలుష్యం అవుతుందని తెలిసిన కూడా దాన్ని నివారించడానికి అసలు ప్రయత్నించరు. పల్లెటూరి కంటే పట్టణాల్లో వాహనాల వల్ల కాలుష్యంగా ఇంకా పెరుగుతుంది. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో అయితే వాయు కాలుష్యం బీభత్సంగా ఉంటుంది. ఇలా వాతావరణంలోని దుమ్ము, దూళి, కాలుష్యం వల్ల కొందరికి అలెర్జీ, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. చాలా మంది కూడా ఈ దుమ్ము వల్ల ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్య నుంచి విముక్తి చెందడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కలబంద జ్యూస్
వాతావారణంలో ఉండే దుమ్ము వల్ల కొందరికి అలెర్జీ వస్తుంది. దీనిని తగ్గించడానికి ఎన్ని మందులు వాడిన కూడా కొందరికి ఫలితం కనిపించదు. అలాంటి వారు కలబంద జ్యూస్‌ను తాగినట్లయితే సమస్య నుంచి విముక్తి చెందుతారు. కలబంద జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అలెర్జీని తగ్గించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. దుమ్ము వల్ల కొందరికి గొంతులో నొప్పి ఉంటుంది. ఈ గొంతు నొప్పి కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కొందరు కలబందను తింటారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉండటం వల్ల ఇవి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. శరీరంపై ఉండే గాయాలు, దద్దుర్ల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. కలబందతో జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

తులసి రసం
హిందువులు తులసి మొక్కను పవిత్రంగా పూజిస్తారు. ఇందులో బోలెడన్నీ పోషకాలు ఉంటాయి. ఇవి అంటువ్యాధులతో పోరాడే గుణాన్ని పెంచుతాయి. ఈ తులసి రసం తాగడం వల్ల గొంతు నొప్పి, బ్రోన్కియల్, బ్రోన్కైటిస్, ఆస్తమాకి సంబంధించిన శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే తులసి రసం వల్ల దగ్గు, జలుబు కూడా తగ్గుతాయి. ఈ తులసి రసంలో కలబంద రసం కలిపి కూడా తాగవచ్చు. ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి పరగడుపున తాగడం వల్ల గొంత అలెర్జీలు అన్ని కూడా మాయమైపోతాయి. దగ్గు, జలుబు అన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది. తులసి ఆకులను యాంటీ బయోటిక్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇందులోని పోషకాలు అనేక రోగాల నుంచి విముక్తి కల్పిస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.