Dry Fruits: ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్‌ను తప్పకుండా తీసుకోవాలి. చూడటానికి చిన్నగా ఉన్నా.. వీటి రేట్లు అయితే ఆకాశాన్ని తాకుతాయి. డైలీ లైఫ్‌లో డ్రై ఫూట్స్‌ను యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో నీరసం, అలసట పోయి యాక్టివ్‌గా మారుతారు. అయితే ఈ డ్రైఫూట్స్‌లో చాలా రకాలు ఉంటాయి. మనలో చాలామందికి కొన్ని మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్‌ను పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు, కాల్షియం, మెగ్నీషియం వంటివి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడతాయి. అయితే కొందరికి తెలియక డ్రై ఫ్రూట్స్‌ను అలాగే తినేస్తారు. పెద్దవాళ్లు ఎలా తిన్నా పర్లేదు.. కానీ పిల్లలకు మాత్రం సరైన పద్ధతిలో మాత్రమే పెట్టాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతారు. మరి పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎలా పెట్టాలి? ఎలా పెడితే వారు ఆరోగ్యంగా ఉంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. బాదం, పిస్తా, వాల్‌నట్స్, ఎండు ద్రాక్ష ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే కొందరు వీటిని డైరెక్ట్‌గా పిల్లలకు పెడతారు. మరికొందరు వీటిని నానబెట్టి పెడుతుంటారు. అయితే వీటిని ఎలా తిన్నా కూడా శరీర ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ పిల్లలకు మాత్రం తేనెలో కలిపి పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు తొందరగా బరువు పెరుగుతారు. ఇవి మార్కెట్లో కూడా లభిస్తాయి. కానీ తేనె క్వాలిటీ ఉండదు. కాబట్టి మీరే స్వచ్ఛమైన తేనెతో ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. డ్రై ఫ్రూట్స్ అన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక గాజు సీసాలో వేసి ఇవి మునిగే వరకు తేనె వేయాలి. తేనెలో ఇవి ఒక పది రోజులు నానబెట్టిన తర్వాత తినాలి. డైలీ ఉదయం, సాయంత్రం సమయాల్లో పిల్లలకు పెట్టడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ఎంత సన్నగా ఉన్న పిల్లు అయిన కూడా కేవలం నెల రోజుల్లోనే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.
డైలీ లైఫ్‌లో డ్రై ఫ్రూట్స్‌ను పిల్లలకు ఇవ్వడం వల్ల శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇందులోని పోషకాలు కండరాలు, ఎముకలను బలంగా చేయడంలో బాగా ఉపయోగపడతాయి. స్నాక్స్‌గా డైలీ పిల్లలకు ఇవి పెడితేనే ఆరోగ్యానికి మంచిది. పిల్లలు నీరసం, అలసట వంటివి సమస్యల నుంచి వెంటనే విముక్తి పొందుతారు. డ్రై ఫ్రూట్స్‌ను రాత్రి పూట లేదా ఉదయం పూట తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఇందులోని పోషకాలు ఎముకలకు మేలు చేయడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తాయి. అలాగే వీటిని తినడం వల్ల పిల్లల మెదడు పనితీరు మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో తొందరగా తెలివితేటలు పెరుగుతాయని కూడా అంటున్నారు. కాబట్టి ఎలాంటి అపోహ పెట్టుకోవద్దని నిపుణులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.