Drinking Water: నిద్రపోయే ముందు వాటర్ తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?

కొందరు రోజంతా వాటర్ ఎక్కువగా తాగకుండా నిద్రపోయే ముందు తాగుతుంటారు. అయితే నిదపోయే ముందు నీరు అధికంగా తాగడం అసలు ఆరోగ్యానికి మంచిదేనా? అనే సందేహంలో పడుతుంటారు. ఇంతకీ నిద్రపోయే ముందు నీరు తాగవచ్చా? తాగితే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 20, 2024 5:55 pm

Drinking water

Follow us on

Drinking Water: నీరు ప్రతి ఒక్కరికి జీవనాధారం. ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డైలీ సరిపడా నీరు తాగడం వల్ల సగం అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతుంటారు. నీరు తాగడం వల్ల జీవక్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరంలోని భాగాలకు కూడా ఆక్సిజన్ సరిగ్గా లభిస్తుంది. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. కానీ చాలా మంది పనిలో బిజీ అయిపోయి తక్కువగా వాటర్ తీసుకుంటారు. రోజులో ఏ సమయంలో అయిన నీరు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.  కొందరు రోజంతా వాటర్ ఎక్కువగా తాగకుండా నిద్రపోయే ముందు తాగుతుంటారు. అయితే నిదపోయే ముందు నీరు అధికంగా తాగడం అసలు ఆరోగ్యానికి మంచిదేనా? అనే సందేహంలో పడుతుంటారు. ఇంతకీ నిద్రపోయే ముందు నీరు తాగవచ్చా? తాగితే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎవరైతే డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారో వారు నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల బాడీకి మంచి జరుగుతుంది. అలాగే నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల ఉదయం లేచిన వెంటనే శరీరంలోని వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అంతే కాకుండా మలవిసర్జన కూడా ఫ్రీగా అవుతుంది. కొందరు ఎక్కువ ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి వారు నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల వీటి నుంచి విముక్తి పొందుతారు. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే చల్లని నీరు కంటే గోరువెచ్చని నీరు నిద్రపోయే ముందు తాగితే ఆరోగ్యానికి ఇంకా మంచిది. వేడి నీరు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది.

 

నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పడుకునే ముందు అధికంగా నీరు తాగడం వల్ల ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో పదే పదే లేవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. హాయిగా పడుకున్న తర్వాత నిద్రకు ఆటంకం కలిగితే మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దీంతో నిద్రలేమి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిద్రకు ఆటంకం కలిగించే విధంగా అధికంగా నీరు తాగవద్దు. నిద్రపోయే గంట ముందు నీరు తాగితే మూత్ర విసర్జనకు అంత ఇబ్బంది ఉండదు. అయితే నిద్రపోయే ముందు గ్లాసు వరకు నీటిని తీసుకోవడం మంచిది. అవసరమైతే పండ్లు రసాలు వంటివి తాగితే ఇంకా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నిద్రపోయేటప్పుడు జ్యూస్ తాగడం వల్ల యంగ్ లుక్‌లో కనిపిస్తారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.