Sleeping Problems: ఇటీవల కాలంలో నిద్ర లేమి సమస్య వేధిస్తోంది. కొందరికి వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. కానీ కొందరికి మాత్రం ఎంతకీ నిద్ర పట్టదు. ఈ నేపథ్యంలో మనకు సరైన నిద్ర పట్టకపోతే ఇబ్బందులొస్తాయి. మనం తిన్న ఆహారం జీర్ణం కాదు. పుల్లటి తేన్పులు రావడం సహజం. ఈ క్రమంలో మనకు అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర లేమి భారంగా మారుతోంది.
మనకు సరైన నిద్ర రావాలంటే అశ్వగంధ చూర్ణం బాగా పనిచేస్తుంది. రోజు పడుకునే ముందు పాలలో అశ్వగంధ పొడి వేసుకుని తాగడం వల్ల గాఢ నిద్ర పడుతుంది. దీంతో మనకు నిద్రలేమి సమస్య లేకుండా పోతుంది. ఇంకా గోరువెచ్చని పాలలో బాదం పొడి వేసుకుని తాగడం వల్ల నిద్రలేమి సమస్య మన దరికి రాదు. దీంతో మంచి నిద్ర పడుతుంది.
రాత్రి పడుకునే సమయంలో పాలలో కాస్త తేనె వేసుకుని తాగితే వెంటనే మంచి నిద్ర పడుతుంది. అల్మండ్ బటర్, అరటిపండుతో కూడా మంచి నిద్ర సాధ్యమవుతుంది. మనం పడుకునే ముందు ఒక అరటిపండు గుజ్జు, పాలు, ఆల్మండ్ బటర్ వేసుకుని మిక్సీ పట్టుకుని తాగితే సుఖమైన నిద్ర పడుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు మనకు నిద్ర పట్టడానికి కారణమవుతాయి.
పాలలో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల కూడా నిద్ర పడుతుంది. ద్రాక్ష రసం కూడా మనకు నిద్ర వచ్చేందుకు సాయపడుతుంది. ఇందులో ఉండే మెలటోనిన్ అనే హార్మోన్ మనకు నిద్ర పట్టేలా చేస్తుంది. ఇంకా చామంతి టీ కూడా మనకు నిద్ర పట్టేందుకు కారణంగా నిలుస్తుంది. ఇలా ఇన్ని రకాల పానీయాలు మనకు నిద్ర వచ్చేందుకు దోహదం చేస్తాయి.