Summer Drinks: ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడం కోసం శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచుకోవాలి. దీనికోసం మనం పానీయాలు తీసుకుంటే మంచిది. ఎండ నుంచి ఉపశమనం పొందే వాటిలో కొబ్బరినీళ్లు ప్రధానమైనవి. ఎండ బారి నుంచి మనల్ని రక్షించే పానీయాల్లో కొబ్బరినీళ్లు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇవి తాగడం వల్ల బాడీ డీ హైడ్రేడ్ కాకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆరెంజ్ జ్యూస్
చర్మం ప్రకాశవంతంగా మెరవాలంటే విటమిన్ సి ఉన్న పండ్లు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇందులో ఉండే ప్రొటీన్ల వల్ల మన చర్మం నిగనిగలాడేలా చేస్తాయి. వీటి జ్యూస్ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మం మెరవాలంటే రోజు నిమ్మకాయ, తేనె కలిపిన నీళ్లు తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ కూడా మనకు చర్మం మెరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. బటర్ మిల్క్ కూడా మనకు వృద్ధాప్య చాయలు రాకుండా చేస్తుంది. ఇందులో విటమిన్ బి12 ఉపయోగం వల్ల చర్మ సౌందర్యం మెరుస్తుంది. బటర్ మిల్క్ తాగడం వల్ల ఇంకా చాలా లాభాలు మన శరీరానికి కలుగుతాయి.
బీట్ రూట్ జ్యూస్
చర్మ సౌందర్యానికి బీట్ రూట్ కూడా బాగా పనిచేస్తుంది. దీని జ్యూస్ తాగడం వల్ల మనకు రోగాలు రాకుండా పోవడమే కాకుండా చర్మం, జుట్టుకు మంచి మందులా మారుతుంది. క్యారెట్ జ్యూస్ కూడా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ మన కంటిచూపు మెరుగుకు బాగా ఉపయోగపడుతుంది. అందుకే క్యారెట్ జ్యూస్ తాగడానికి అందరు ఇష్టపడుతుంటారు.
దోసకాయ రసం
దోసకాయ కూడా మనకు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఎండాకాలంలో దోసకాయ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. దోసకాయ తిన్నా రసం తాగినా మనశరీరానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని తేమగా మార్చడంలో సాయపడుతుంది. ఇలా మనకు దొరికే వాటితోనే జ్యూస్ చేసుకుని తాగితే మన చర్మం ఎంతో కళాత్మకంగా మారుతుంది.