Drink Beer :నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రోజంతా ఏదో ఒత్తిడితో ఉంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు యూత్ కూడా కొన్ని విషయాల్లో టెన్షన్ పడుతున్నారు. దీంతో అప్పుడప్పుడు రిలాక్స్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి మందేసి చిందేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువగా చల్లటి బీర్ తాగడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతారు. బీర్ అనగానే చాలా మంది ఏదో తెలియని ఉత్సాహం. ఓ వైపు బాడీని కూల్ చేయడంతో పాటు మరోవైపు మత్తెక్కించే బీర్ తాగడం వల్ల ఎంజాయ్ చేస్తామని చాలా మంది పేర్కొంటారు. అయితే బీర్ తాగేటప్పుడు కొందరు ఫుడ్ విషయంలో ఈ తప్పులు చేస్తారు. దీంతో మానసికోల్లాసం అటుంచి కొత్త రోగాలు వస్తాయని అంటారు. ఇంతకీ అసలు విషయమేంటంటే?
చల్లటీ బీర్ తాగేటప్పుడు వాటికి మంచింగ్ కోసం స్పైస్ ఫుడ్ ఉండాలని కోరుకుంటారు. దీంతో చికెన్, రోస్టెడ్ ఫుడ్ ఉండేవి తీసుకుంటారు. అంతేకాకుండా మాంసాహారం తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ ఉంటుందని భావించి ఎక్కువగా వాటికే ప్రిఫరెన్స్ చేస్తారు. అయితే ఇవి తాత్కాలికంగా మంచి రుచిని అందిస్తాయి. దీర్ఘకాలికంగా వీటితో అనర్థాలే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బీర్ తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఇలాంటి సమయంలో స్పైస్ ఫుడ్ తీసుకోవడం డైజేషన్ సమస్యలు వచ్చి అనారోగ్యానికి గురవుతారు.
ఈ నేపథ్యంలో అసలు బీర్ తాగేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అనే సందేహం ఉంటుంది. బీర్ లో ఎక్కువగా సోడియం ఉటుంది. దీనికి విరుద్ధమైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అంటే ఫ్రూట్స్ తో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి జీర్ణ క్రియ సమస్యలు ఉండవు. అందువల్ల బీర్ తాగే వారు ఫుడ్ విషయంలో ఎలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఇక కొందరు బీర్ తాగేటప్పుడు అస్సలు ఫుడ్ తీసుకోరు. కానీ ఇది చాలా ప్రమాదం. ఎలాంటి ఆల్కహాల్ తీసుకున్నా లైట్ ఫుడ్ తప్పనసరి తీసుకోవాలి. దీంతో శరీరంలోని జీర్ణక్రియ సమతుల్యమై ఆల్కహాల్ ఎఫెక్ట్ శరీరంపై పడకుండా ఉంటుంది. లేకుంటే అల్కహాల్ ఎక్కువై శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది రాను రాను కిడ్నీలను నాశనం చేసే స్థాయికి వెళ్తుంది. అందువల్ల మానసికోల్లాసానికి మోతాదు ఆల్కహాల్ మంచిదే అయినా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.