Dri Fruits : ఖాళీ కడుపుతో ఇవి తీసుకుంటే డేంజర్!

డ్రై చెర్రీస్. వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇందులో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రక్టోజ్ అధికంగా ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : March 10, 2024 9:21 am

Dryfruits

Follow us on

Dri Fruits :ఉదయం లేవగానే చాలా మందికి ఏదో ఒకటి తాగాలని ఉంటుంది. ఈ క్రమంలో టీ లేదా కాఫీతో దినచర్య ప్రారంభిస్తారు. ఇవి తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటామని భావిస్తారు. టీ లో ఉండె కెఫిన్ మెదడును చురుగ్గా ఉంచుటుంది. కానీ శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వదు. దీంతో ఒక్కోసారి డీ హైడ్రేషన్ కు గురై నీరసంగా ఉంటారు. అయితే పొద్దు పొద్దున్నేు ఇలాంటి వాటి కంటే ముందు కొన్ని ఆరోగ్య కరమైన పదార్థాలను తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఈమధ్య చాలా మంది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. వీటిలో కొన్ని ఆరోగ్యానికి బదులు అనార్థాలకు దారి తీస్తున్నాయి. ఇవి తీసుకోవడం వల్ల నష్టమే జరుగుతుందని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే?

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కింద పూరి, దోశ కంటే డ్రైప్రూట్స్ తీసుకోవడం మంచిదే. కానీ కొన్ని మాత్రం డేంజర్ అంటున్నారు. వీటిలో ప్రధానంగా డ్రై చెర్రీస్. వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇందులో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రక్టోజ్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. లేకుంటే కడుపు ఉబ్బరంగా ఉండి, గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది.

ఖజ్జూరను చూడగానే ఇష్టంగా తినాలని అనిపిస్తుంది. వీటిలో ఉండే పోషకాలు కూడా ఎక్కువే. కానీ ఉదయం వీటికి దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. దీంతో నీరసంగా అయిపోతారు. అయితే మధ్యాహ్నం, ఇతర సమయాల్లో వీటిని తీసుకోవడం మంచింది. డ్రై ప్రూట్స్ లో చెప్పుకోదగినవి ఎండి ఆప్రికాట్లు. ఇవి విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంటాయి. కానీ ఇవి ఉదయం తీసుకోవడం వల్ల చక్కెర, కేలరీలు పెరుగుతాయి.

అయితే ఉదయం కొన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సినవి ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు. వాటిలో ఓట్ మీల్, పెరుగు, గుడ్లు, బెర్రీలు, బ్రెడ్, స్మూతీస్, అవకాడో వంటివి తీసుకోవచ్చు. ఇందులో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఉండడం వల్ల ఇవి ఎనర్జీతో పాటు కడుపు నిండినట్లు అవుతుంది. దీంతో అధికంగా కొవ్వు పెరిగే అవకాశం ఉండదు.