https://oktelugu.com/

Dream Astrology: చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారా.. అయితే దాని సంకేతం ఇదే!

Dream Astrology: సాధారణంగా మన కుటుంబ సభ్యులు లేదా మన బంధుమిత్రులు ఎవరైనా చనిపోతే చాలామందికి వారు కలలో కనిపిస్తూ ఉంటారు. ఇలా తరచూ చనిపోయినవారు మన కలలో కనిపించడం వల్ల కొందరు ఎంతో భయాందోళన చెందుతారు. అసలు చనిపోయిన వారు కలలో కనిపించడానికి గల కారణం ఏమిటి ఎందుకు ఇలా కలలో కనిపిస్తున్నారనే విషయానికి వస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారు అంటే వారి ఆత్మ ఈ లోకంలో సంచరిస్తుందనీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 14, 2022 / 09:00 AM IST
    Follow us on

    Dream Astrology: సాధారణంగా మన కుటుంబ సభ్యులు లేదా మన బంధుమిత్రులు ఎవరైనా చనిపోతే చాలామందికి వారు కలలో కనిపిస్తూ ఉంటారు. ఇలా తరచూ చనిపోయినవారు మన కలలో కనిపించడం వల్ల కొందరు ఎంతో భయాందోళన చెందుతారు. అసలు చనిపోయిన వారు కలలో కనిపించడానికి గల కారణం ఏమిటి ఎందుకు ఇలా కలలో కనిపిస్తున్నారనే విషయానికి వస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారు అంటే వారి ఆత్మ ఈ లోకంలో సంచరిస్తుందనీ అర్థం. ఈ విధంగా చనిపోయిన వారి ఆత్మలు మనకు కలలో కనిపించిన అప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

    Also Read: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండానే?

    చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తే వారి పేరున రామాయణం, భగవద్గీత వంటి పురాణాలను చదవాలి.
    ఒకవేళ వారు ఎంతో బాధతో,ఏమీ మాట్లాడకుండా మన కలలో కనిపిస్తే మీరు ఏదో తప్పు చేయబోతున్నారని సంకేతం. అదేవిధంగా చనిపోయిన మన బంధువులు ఆకలితో కనపడితే వెంటనే పేదలకు అన్నదానం చేయాలి అప్పుడే మన బంధువుల ఆత్మ సంతోషపడుతుంది. అదేవిధంగా కోపంతో చనిపోయిన వ్యక్తులు కలలో కనపడితే వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు. కనుక అతను కలలో చెప్పిన విధంగా ఆ పద్ధతులను చేయటం వల్ల అతని ఆత్మ సంతృప్తి చెందుతుంది.

    కొన్నిసార్లు చనిపోయిన మన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తారు. అలా సంతోషంగా నవ్వుతూ కనిపించడం వల్ల మనకి అన్ని శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే చాలామంది తీరని కోరికలతో మరణించి ఉంటారు కావున కలలో వారు మనకి ఏదైనా చేయమని సలహా ఇస్తే తప్పకుండా చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది ఈ లోకం వదిలి వెళ్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.

     

    ఇవి కూడా చదవండి: బీటెక్‌ అర్హతతో ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?