https://oktelugu.com/

Double Chin: డబుల్ చిన్ చిరాకు తెప్పిస్తుందా? ఈ యోగాసనాలతో పోగొట్టేద్దామా!

కొందరికి మెడ దగ్గర కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల దరిద్రంగా కనిపిస్తుంది. దీన్నే డబుల్ చిన్ అంటారు. ఈ డబుల్ చిన్ అనేది శరీరంలోని కొవ్వే మెడ దగ్గర మారుతుంది. దీనివల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు. ఈ డబుల్ చిన్ ఉంటే అందంగా కనిపించమని భావిస్తుంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2024 / 04:35 AM IST

    Double chin

    Follow us on

    Double Chin: సాధారణంగా చాలామంది చర్మ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యం, బాడీ అన్ని ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. చర్మం అందంగా ఉందా లేదా, శరీరంలో కొవ్వు ఉందా అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే కొందరికి ఎక్కువగా కొవ్వు ఉంటుంది. దీనివల్ల మెడ దగ్గర దరిద్రంగా కనిపిస్తుంది. దీన్నే డబుల్ చిన్ అంటారు. ఈ డబుల్ చిన్ అనేది శరీరంలోని కొవ్వే మెడ దగ్గర మారుతుంది. దీనివల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు. ఈ డబుల్ చిన్ ఉంటే అందంగా కనిపించమని భావిస్తుంటారు. కేవలం మెడ దగ్గర మాత్రమే కాకుండా ముఖంపై, గడ్డంపై ఉంటుంది. అయితే దీన్ని తగ్గించుకోవాలని చాలా మంది మందులు కూడా వాడుతారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. తీసుకునే ఆహార పదార్థాల వల్ల కొవ్వు శరీరంలోనే కాకుండా ముఖం, గడ్డంపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఈ డబుల్ చిన్‌ను తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదా? అయితే ఈ యోగాసనాలతో డబుల్ చిన్‌ను పోగొట్టవచ్చు. అదేలాగే మరి తెలియాలంటే ఆలస్యం లేకుండా ఆర్టికల్ చదివేయండి.

    యుక్త వయస్సులో ఉన్నవారికి ఈ డబుల్ చిన్ బాగా ఇబ్బంది పెడుతుంది. దీన్ని నుంచి విముక్తి పొందాలంటే యోగా తప్పకుండా చేయాలని నిపుణులు అంటున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి యోగా కాపాడుతోంది. దీన్ని డైలీ చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఈ డబుల్ చిన్ కూడా మాయమవుతుంది. ఈ యోగా చేయడం వల్ల ముఖం కూడా చాలా కాంతివంతంగా తయారవుతుంది. కొన్ని యోగాసనాలను డైలీ వేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన కొవ్వు అంతా తగ్గుతుంది. అలాగే చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. అయితే సింఘాసనం వేయడం వల్ల ముఖంపై కండరాలు పనిచేస్తాయి. దీంతో ముఖంపై ఉండే కొవ్వు అంతా తగ్గిపోతుంది. డైలీ ఒక పది నిమిషాల పాటు ఈ ఆసనం వేస్తే ఈజీగా సమస్య క్లియర్ అవుతుంది. అలాగే జివ్హ బంధ ఆసనం వేయడం వల్ల డబుల్ గడ్డం తగ్గి ముఖం ఆకారం మారుతుంది. వీటితో పాటు చేపల భంగిమ అనే ఆసనాన్ని వేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు క్లియర్ అవుతాయి. ఫేస్ యోగా కూడా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు అన్ని తొలగిపోయి.. అందం మీ సొంతం అవుతుంది.

    ఈ డబుల్ చిన్ నుంచి విముక్తి చెందాలంటే యోగాతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఆయిల్, స్పైసీ ఫుడ్స్ తినకూడదు. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు ఎక్కువగా వాటర్ తాగాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. పూర్వ కాలం నుంచి యోగా చేస్తున్నారు. డైలీ యోగా చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ముఖంపై ఉండే కొవ్వు అంతా పోతుంది. యోగా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. డైలీ యోగా చేస్తే శరీరంలోని కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. రోజుకి కనీసం ఒక 20 నిమిషాలు అయిన యోగా చేయడం ఆరోగ్యానికి మంచిది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.