Varalakshmi Vratam 2023 : వరలక్ష్మీ వ్రతం రోజున పొరపాటున ఈ పనులు చేయకూడదు..

వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం ఉండేవారు పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

Written By: NARESH, Updated On : August 24, 2023 8:08 pm

varalaxmi

Follow us on

Varalakshmi Vratam 2023 : పవిత్ర శ్రావణ మాసంలో ముందుగా వచ్చే పండుగ ‘వరలక్ష్మీ వ్రతం’. లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ వ్రతం ఆచరించే ఈరోజును మహిళలు ప్రత్యేకంగా వేడుక నిర్వహించుకుంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్లపక్షం శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కోరిన కోర్కెలు తీరుతాయని, అమ్మవారు వరాలు ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే చాలా మంది వరలక్ష్మీ వ్రతం పేరు చెప్పొ కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి రాదు. అందువల్ల ఈ తప్పులను ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని పండితులు చెబుతున్నారు.

వరలక్ష్మీ వ్రతం చేయాలనుకునే మహిళలు ఒకరోజు ముందుగానే పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటికి మామిడి తోరణాలు అలంకరించాలి. ఇల్లు శుభ్రంగా ఉండడం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందువల్ల ఇంటిని పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక ఇంట్లో ఈశాన్యం వైపున అమ్మవారిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి. ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు సిద్ధం చేయాలి. ఆ ముగ్గు మీద పసుపు బొట్టు పెట్టి పీటను ఉంచి దానిపై లక్ష్మీ దేవిని ప్రతిష్టించాలి. దానిపై తెల్లటి వస్త్రం ఉంచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్టించాలి.

బియ్యంపై ఉంచిన కలశంను పసుపు, కుంకుమతో అలంకరించుకోవాలి. ఆ తరువాత దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు దేవతకు ప్రతిపూపం. అందువల్ల పసుపు ముద్దతో అమ్మవారి ఆకారం వచ్చేలా తయారు చేసుకోవాలి. ఆ తరువాత కలశంపై మామిడి ఆకులను ఉంచుకోవాలి. అమ్మవారి అష్టోత్తరశతనామావళిత పూజించడం వల్ల ఎంతో మేలు. ఓ వైపు దీనిని చదువుతూ ఐదు తోరణణాలను సిద్ధం చేసుకోవాలి.

అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆవునెయ్యితో దీపం వెలిగించడం ఉత్తమం. అలాగే ఆవుపాలతో చేసిన పరమాన్నం లేదా పాయసంను అమ్మవారికి నివేదించడం వల్ల ఎంతో సంతోషిస్తుందని అంటారు. వీటితో పాటు అరటిపండు ఉంచడం చాలా మంచిది. ఇక కాస్త తీపి పదార్థాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా పూజ పూర్తయిన తరువాత ఇంటికి ముత్తయిదులను పిలచి వారికి వాయినం ఇచ్చుకోవాలి.

ఇక వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం ఉండేవారు పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఎంతో నిష్టగా మాత్రమే ఈ పూజ చేయాలి. ఇలాంటి సమయంలో మాంసం జోలికి అస్సలు వెళ్లకూడదు. వరలక్ష్మీ వ్రతం పూజ పూర్తయినా రోజు మాత్రం ఇల్లు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పూజ చేసేవారు చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా పూజ చేయడం వల్ల అమ్మవారు కరుణిస్తారని అంటున్నారు.