Doorstep Banking Service: ఆర్థిక వ్యవహారాలు సాగించడానికి నేటి కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అవుతోంది. కానీ కొన్ని అవసరాలకు బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా వయసు పైబడిన వారు తమ పెన్షన్ తీసుకోవానికి, లేదా ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకులో కచ్చితంగా వారు ఉండాలి. కానీ ఒక్కోసారి వారు వెళ్లే పొజిషన్ ఉండదు. మరికొందరు నడవలేని పరిస్థితి ఉండదు. ఈ సమయంలో వారి బ్యాంకు అవసరాలు ఎలా తీరాలి? అప్పుడు ఏంచేయాలి? అయితే దీనికో సొల్యూషన్ ఉంది. ఇలాంటి వారు బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకునే ఇంటికి రప్పించుకునే మార్గం ఉంది. అదెంటో తెలుసుకోండి.
రామారావు అనే వ్యక్తి వయసు 70 సంవత్సరాలు.. తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయిన డబ్బులను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో కొంత అమౌంట్ ను ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ అతను నడవలేని పరిస్థితి. పోనీ తనను తీసుకెళ్లేవారు ఎవరైనా ఉన్నారా? అంటే అందరూ వారి వారి పనుల్లో బిజీ అయ్యారు. బ్యాంకుల్లో రామారావు లేకపోతే ఏ పని జరగదు. ఈ సమయంలో ఈయన బ్యాంకులు తన పనిని ఇంటి నుంచే చేసుకోవచ్చు. బ్యాంకుకు సంబంధించిన అధికారులను ఇంటికి రప్పించుకునే అవకాశం ఉంది.
Doorstep Banking Service గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ దీని ద్వారా బ్యాంకులు కొన్ని సర్వీసులు ఇంటికి వచ్చే చేస్తుంది. రామారావు లాంటి వారి కోసం కొందరు అధికారులను ఇంటికి పంపి వారి అవసరాలను తీరుస్తుంది. అయితే ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. బ్యాంకుతో సర్వీస్ చేసుకునే వ్యక్తి వయసు 70 సంవత్సరాలకు పైగా ఉండాలి. ఒకవేళ 70 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నా.. వికలాంగుడు అయి ఉండాలి. దీంతో వీరికి సంబంధించిన వాళ్లు బ్యాంకులో ముందుగా సమాచారం ఇస్తే కొందరు అధికారులను ఇంటికి పంపి సర్వీసు చేయిస్తుంది.
అయితే దీనికి కొంత చార్జీ వసూలు చేస్తుంది. ఆ చార్జీలు సర్వీసును భట్టి ఉంటాయి. కానీ కొందరు అత్యవసర సర్వీసులు చేయించుకునేవారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. అయితే చార్జీల గురించి ఆలోచించేవారు ఒక్కడో విషయం గమనించాలి. ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లాలంటే ప్రయాణ సాధనాలకు చార్జీలు చెల్లించాలి. దాదాపు అంతే చార్జీలతో ఇంట్లోనే బ్యాంకు అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే ఇలా సర్వీస్ చేయించుకునేవారి ఇల్లు బ్యాంకుకు 5 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉండాలి.