Dont-take-this-things
Don’t take: అప్పుడప్పుడు కొందరు పెద్దలు ‘సమస్యను కొని తెచ్చుకున్నావు’ అని అంటారు. ఏ సరదాగా అన్నా కొందరికి కొన్ని వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత దరిద్రం పట్టుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు నిత్యం ఉంటాయి. అయితే కొందరు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే ఆ వస్తువును వదిలించుకోవాలని అనుకుంటారు. మరికొందరు మాత్రం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు. వాస్తవానికి ఒక వస్తువును కొనుగోలు చేసిన తర్వాత కష్టాలు వస్తే ఆ తర్వాత అలాగే ఉంటాయని అంటారు. కానీ మరోసారి అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే ఎప్పుడూ ఏ వస్తువు కొనుగోలు చేయాలో తెలుసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం కొన్ని వస్తువులను ఎవరైనా ఉచితంగా ఇచ్చిన తీసుకోకూడదు.. మరి ఆ వస్తువు లేవు ఇప్పుడు తెలుసుకుందామా..
సాధారణంగా కొన్ని వారాల్లో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయవద్దు అనేది ఇప్పటివరకు వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. ఉదాహరణకు లక్ష్మీదేవికి ప్రతిరూపమైన చీపురు నువ్వు శనివారం కొనుగోలు చేయవద్దు. అలాగే ఇనుప వస్తువులు కూడా ఈరోజు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావద్దు. ఇక తెల్లటి వస్తువులైన పాలు, రాతి ఉప్పు, పెరుగు, బియ్యం వంటివి శుక్రవారం ఇతరులకు ఇవ్వకూడదు. అలాగే దేవాలయాల్లో దీపం వెలిగించే సమయంలో ఇతరులను అగ్గిపెట్టె అడగకూడదు. మరో దీపంతో దీపాన్ని వెలిగించి ప్రయత్నం చేయకూడదు.
అయితే కొందరు వస్తువులు దానం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని వస్తువులు ఎంత దానం చేసిన తీసుకోకుండా ఉండాలి. ముఖ్యంగా ఎవరైనా బూట్లు దానం చేయాలని వస్తే వాటికీ దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎవరైతే దానం చేస్తారో వారికి సంబంధించిన దరిద్రం ఇతరులకు చుట్టుకుంటుంది. అలాగే ఎవరైనా చింతా పండును ఉచితంగా ఇచ్చిన తీసుకోకూడదు. దీనిని డబ్బుతో మాత్రమే కొనుగోలు చేయాలి. జుట్టుకు ఉపయోగించే కుంకుడుకాయ రసాన్ని లేదా పౌడర్ కు సంబంధించిన వస్తువులు ఉచితంగా ఎవరిచ్చినా తీసుకోకూడదు.
ఇక పూజారి నుండి ప్రసాదాన్ని చేతి ద్వారా మాత్రమే స్వీకరించాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకోకూడదు. అలాగే ఆలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఆలయంలో కూర్చొని తినాలి. లేదా ఇంటికి తీసుకొని రావాలి. అంతేకానీ మధ్యలో ఎక్కడ కూర్చొని ప్రసాదాన్ని తినకూడదు.
ఇలా చాలావరకు వస్తువులను ఎవరు ఉచితంగా ఇచ్చిన తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేయడం వల్ల సమస్యలను తెచ్చుకున్నవారవుతారు. అయితే ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లయితే వాటికి పరిహారంగా దేవుళ్లకు పూజలు చేయడం లేదా మరోసారి అలాంటి తప్పులు చేయకుండా ఉండాలి. ఇంకా ఎవరికైనా దానం ఇవ్వాల్సి వస్తే శుక్రవారం కాకుండా ఇతర రోజుల్లో దానం చేయవచ్చు. అలాగే మిగతా రోజుల్లో ఇలాంటి దానం చేసిన ఎలాంటి సమస్యలు ఉండావు. కానీ శుక్రవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను ఇంట్లో నుంచి బయటకు తీసుకుపోకుండా ఉండాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రతిరూపాలైన చీపురు వంటి వాటిని ఇంట్లో నుంచి బయటపడేయకుండా ఉండాలి. ఉప్పును కూడా ఇతరులకు ఇచ్చే సమయాన్ని చూసుకొని జాగ్రత్త పడాలి.