Lord Shani
Lord Shani : ప్రజలు చాలా విషయాలను నమ్ముతారు. కొన్ని విషయాల పట్ల మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక నమ్మకాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు. వారంలోని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేశారు. ఆ రోజు వారికి ఇష్టమైనవి, నచ్చని పనులు చేయకూడదు అంటారు. ఇక హిందూ మతంలో కూడా మరింత ఎక్కువ నమ్మకాలు ఉంటాయి. ముఖ్యంగా శని భగవానుడి విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు ప్రజలు. ఆయనకు చాలా ఇష్టమైన రోజు శనివారం. ఈ రోజు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. మరి ఈ రోజు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అసలు శాస్త్రం ఏం చెబుతోంది? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం ఎట్టి పరిస్థితుల్లో కొత్త చీపురు కొనుగోలు చేయవద్దు అంటున్నారు పండితులు. ఈ రోజు గనుక కొత్త చీపురు కొంటే శని దేవుడు ప్రతికూల ప్రభావం చూపిస్తాడట. . అందుకే శనివారం చీపురు కొనకుండా వాయిదా వేస్తుంటారు చాలా మంది. శనివారం నల్లటి దుస్తులు ధరించడం కూడా మానేయాలి. ఈ రోజు నల్లని దుస్తులు అసలు ధరించవద్దు. అంతేకాదు బ్లాక్ షూస్ కూడా ధరించకూడదు. ముఖ్యంగా ఏదైనా శుభ కార్యం కోసం బయటకు వెళ్లేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుంటే అపజయం కలుగుతుందట.
శనివారం రోజు కత్తెర కూడా కొనుగోలు చేయకూడదు. ఈరోజున కత్తెర కొంటే ఇంట్లో గొడవలు జరిగుతాయట. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కత్తెర సంబంధంలో చీలిక తెస్తుందని అంటున్నారు పండితులు. అందుకే శనివారం రోజు దీనిని కొనుగోలు చేయకుండా ఉండటమే బెటర్. శనివారం రోజున ఎరుపు రంగు దుస్తులకు కూడా దూరంగా ఉండటం బెటర్. ఎర్ర రంగు వస్తువులు కూడా కొనకుండా ఉండటం బెటర్.
ఈ ఎరుపు రంగును అంగారకుడికి సూచనగా చెబుతారు. కుజుడు ,శని రెండు వ్యతిరేక గ్రహాలు. అందుకే ఇలా చేస్తే వారు ఇబ్బందులకు దారి తీస్తారట. . శనివారం రోజును ఎవరికీ ఉప్పును దానం ఇవ్వకూడదు. అంతేకాదు ఈ రోజు ఉప్పును దానం చేసినా, లేదా తీసుకున్నా అప్పుల కుప్ప పెరుగుతుందట. అంతేకాకుండా శనివారం రోజున ఉప్పును కొనుగోలు చేసినా సరే మంచిది కాదు అని నమ్ముతారు.
ఈ రోజు ఇనుముతో చేసిన వస్తువులను కొనుగోలు చేయకండి. ఇలాంటి వస్తువులను ఈ రోజు కొనుగోలు చేస్తే శనిదేవుని ఆగ్రహానికి బలి అవుతారట. కొత్త ఇనుము వస్తువులు ఉన్నా సరే వాటిని శనివారం రోజు ప్రారంభించకూడదు. అలాగే శనివారం రోజున ఆవనూనె కూడా కొనుగోలు చేయకండి. ఈ రోజు శనికి నూనె నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఈ రోజు ఎవరికైనా దానం చేస్తేనే నూనె కొనాలి.