Doing these things after sex: శృంగారం తరువాత ఈ పనులు చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

శృంగారంతో ఇద్దరు వ్యక్తులు సంతోషంగా ఉంటారు. అయితే భాగస్వాములిద్దరూ అధిక సంతృప్తి కలగాలంటే శృంగారం తరువాత వెంటనే నిద్రించకూడదు. చాలా మంది మగవాళ్లు ఈ పని పూర్తికాగానే తమకేమీ పట్టనట్లు నిద్రిస్తారు. తమ భాస్వామిని పట్టించుకోరు

Written By: Srinivas, Updated On : October 21, 2024 2:53 pm

Doing these things after sex

Follow us on

Doing these things after sex: శృంగారం జీవితంలో అత్యంత ప్రధాన అవసరం. అయితే ఆరోగ్యకరమైన శృంగారాన్ని చాలా మంది కోరుకుంటారు. ఇందు కోసం కొందరు ప్రత్యేకంగా ప్లాన్ వేస్తారు. శృంగార జీవితం వల్ల ఇద్దరు వ్యక్తులు అధిక సంతృప్తి పొందుతారు. అయితే ఇదేదో చేయాలి అని కొందరు తొందరగా పని ముగించేస్తారు. ఆ తరువాత తన దారి తనది… అన్నట్లు నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల భాగస్వామి తీవ్ర అసంతృప్తితో ఉంటుందని కొందరు మానసిక నిపుణులు చెబుతున్నారు. భాగస్వామిని ముగ్గులోకి దించే ముందు చేసే ప్రయత్నాల కన్నా.. ఆ తరువాత కూడా వెంటనే పక్కకు జరగకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేవో చూద్దాం..

శృంగారంతో ఇద్దరు వ్యక్తులు సంతోషంగా ఉంటారు. అయితే భాగస్వాములిద్దరూ అధిక సంతృప్తి కలగాలంటే శృంగారం తరువాత వెంటనే నిద్రించకూడదు. చాలా మంది మగవాళ్లు ఈ పని పూర్తికాగానే తమకేమీ పట్టనట్లు నిద్రిస్తారు. తమ భాస్వామిని పట్టించుకోరు. కానీ అలా కాకుండా ఒకరినొకరు కాసేపు మాట్లాడుకోవాలి. శృంగారం వల్ల ఎటువంటి అనుభూతి కలిగిందోననే విషయంపై చర్చించుకోవాలి. ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ తరువాత సమయంలో అలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి.

శృంగారంతో కేవలం శారీరకంగా తృప్తి పొందాలనుకోవడం పొరపాటు. ఈ కార్యక్రమం ద్వారా మనసు కూడా ఉల్లాసంగా ఉండాలని అనుకోవాలి. దీంతో భాగస్వామితో ప్రేమగా ఉండాలి. వెంటనే రంగంలోకి దిగకుండా ముందుగా ప్రేమగా ఉండాలి. ఆ తరువాత పని పూర్తయ్యాక కూడా వారితో ప్రియమైన మాటలను చెబుతూ ఉండాలి. వీలైతే కామెడీచేస్తూ వారితో సరదాగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధుత్వం మరింత బలపడుతుంది.

శృంగారం చేసే సమయంలో భాగస్వాములు కన్వినెంట్ గా ఉన్నారా? లేదా? అనేది చూసుకోవాలి. కొందరు తమ పార్ట్ నర్ కు అసౌకర్యంగా ఉన్నా.. తమ కోరిక తీర్చుకోవడానికి మగవాళ్లు కాస్త దూకుడుగా వ్యవహరిస్తారు. ఇలా చేయడం వల్ల వారిపై చెడు ప్రభావం కలుగుతుంది. ఏదో పని చేసినట్లుగా చేయడం వల్ల మరోసారి ప్రేమగా దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల ఎదుటివారి మనస్తత్వాన్ని పూర్తి గా తెలుసుకున్న తరువాతే రంగంలోకి దిగడం మంచిది.

రాత్రి సమయంలోనే మాత్రమే కాకుండా కొందరు పగలు కూడా రస క్రీడలో పాల్గొంటారు. కానీ ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఇలాంటి సమయంలో వారితో కేవలం ఈ పనిని మాత్రమే కాకుండా వారితో సరదాగా ఉండాలి. సినిమాలు చూడడం, షాపింగ్ వెళ్లడం.. కలిసి విహార యాత్రలకు వెళ్లడం వంటి పనులు చేయాలి. వీలైతే జీవిత భాగస్వామి కోరుకున్న వస్తువును కొనుగోలు చేయాలి. లేదా రెస్టారెంట్లోకి వెళ్లి ఏకాంతంగా మాట్లాడుకోవాలి. చాలా మందికి నేరుగా శృంగారం చేయడం కన్నా ఇలా ప్రేమగా ఉండడానికి ఇష్టపడుతారు. అయితే మగవాళ్లు తమ కు అనుగుణంగా మలుచుకునేందుకు కాస్త రాష్ గా ప్రవర్తించవచ్చు. కానీ ఇది కూడా ప్రేమతో కూడుకొని వారి ఇష్టానుసారంగా ఉండడం వల్ల అర్థం చేసుకోగలుగుతారు. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతంది. దీంతో ఇద్దరూ సంతోషంగా ఉంటారు..